37.2 C
Hyderabad
May 6, 2024 12: 11 PM
Slider మహబూబ్ నగర్

ఎస్ సి హాస్టల్ విద్యార్థులకు వస్తువులు, స్టడీ మెటీరియల్ పంపిణీ

#schostel

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని ప్రభుత్వ ఎస్ సి హాస్టల్ విద్యార్ధులకు నిత్యావసర వస్తువులు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. విద్య ద్వారా మాత్రమే యువకులు విజయం సాధించగలరని ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమాధికారి సత్యనారాయణ యాదవ్ అన్నారు. వసతి గృహంలో కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న వస్తువులను సక్రమంగా ఉపయోగించుకుని విద్యలో రాణించాలని కోరారు. గురువారం ఉదయం ప్రభుత్వ ఎస్సీ ఎ బాలుర వసతి గృహం లో  వసతి గృహంలో ఉన్న మొత్తం 20 మంది విద్యార్థులకు, 15 రకాల వస్తు సామాగ్రి ప్రతి విద్యార్థికి అందించారు. ప్రతి విద్యార్థికి కి బెడ్ షీట్, కార్పెట్, చలి కోటు, టవల్స్, పారగాన్ చెప్పులు అందించారు.

వీటితో బాటు స్టడీ మెటీరియల్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, రాయల్ అట్లాస్, ఎగ్జామ్ ప్యాడ్స్, కంపాస్ బాక్స్, గ్రాఫ్ పేపర్స్, తెలంగాణ మ్యాప్ పాయింటింగ్ బుక్లెట్, పెన్సిల్లు, షార్ప్ నర్స్, తుడిచే రబ్బర్ లు తదితర వస్తువులను వసతి గృహ సంక్షేమ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హాస్టల్లో  కల్పిస్తున్న వసతులు, వస్తువులు స్టడీ మెటీరియల్స్ సక్రమంగా ఉపయోగించుకుని విద్యలో రాణించాలని కోరారు.

వసతి గృహంలో సోలార్ ప్యానల్స్ తో 24 గంటల కరెంటు, ప్రత్యేక స్టడీ అవర్స్, వినూత్న కార్యక్రమాలతో హాస్టల్ అకాడమిక్ క్యాలెండర్, శాస్త్రీయ వైఖరి అభివృద్ధి దిశగా సైన్స్ మోడల్స్ తయారు చేయిస్తామని తెలిపారు. ప్రత్యేక చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ ల్యాబ్, ప్రతిరోజు  నాలుగురు టుటర్ల  పర్యవేక్షణతో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, మానసిక వికాస, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు, భౌతిక వికాసంలో భాగంగా ప్రతి ఆదివారం ఆటలకు సంబంధించిన మెటీరియల్ ఇస్తున్నామని తెలిపారు. వసతి గృహంలో ఇంకా 80 వరకు అడ్మిషన్లు ఇస్తామని, రిజర్వేషన్ ప్రాతిపదికన అత్యధికంగా ఎస్సీ విద్యార్థులకు, మిగతా బిసి, ఎస్టీ  మరియు ఓసి విద్యార్థులకు కూడా సీట్లు ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వసతి గృహాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ నాలుగో తరగతి ఉద్యోగులు ఈశ్వరయ్య, గుంతమ్మ పాల్గొన్నారు.

Related posts

‘యువ’తరాన్ని ఉర్రూతలూగించే ఎంటర్టైన్మెంట్ ఛానల్

Satyam NEWS

మంత్రి ప్రారంభించాక..మళ్లీ ప్రారంభించడం ఏమి సంస్కారం?

Satyam NEWS

పోలీసుల నైతికతను దెబ్బతీసే ఈనాడు కథనం

Satyam NEWS

Leave a Comment