31.7 C
Hyderabad
May 2, 2024 08: 07 AM
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ నేత ఆఫీసులో ఎన్నికల అధికారుల సోదాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆఫీసులో ఎన్నికల అధికారులు, ఐటి, ఫ్లైయింగ్ స్క్వార్డ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారు రెండు గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. ఓటర్లకు పంచేందుకు కార్యాలయంలో భారీగా నగదు దాచారన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పోలీసుల తనిఖీలో భారీగా నగదు లభ్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది.

నగదు ఎంత అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే కాంగ్రెస్ నేత గూడెం శ్రీనివాస్ రెడ్డికి కంకర క్రషింగ్ మిషన్ ఉంది. దానికి సంబంధించిన డబ్బులు ఏమైనా కార్యాలయంలో ఉంచారా.. లేక పార్టీకి సంబంధించిన డబ్బును ఉంచారా అనే విషయాలపై అధికారులు విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తోంది.

మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా

అయితే గత అర్థరాత్రి కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో పోలీసులు భారీగా చేరుకుని తనిఖీలు చేపట్టారు. వైస్ చైర్మన్ నివాసంలో డబ్బులు దాచారన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా పోలీసులకు నగదు లభించలేదు. అయితే మహిళా పోలీసులు లేకుండా మహిళనైన తన ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టడం పట్ల వైస్ చైర్మన్ ఇందుప్రియ పోలీసులను ప్రశ్నించారు. ఇటీవల వైస్ చైర్మన్ దంపతులు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా తనిఖీలు చేపడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు పర్యటన తర్వాత

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ గా తనిఖీలు జరగడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇవాళ కామారెడ్డి పట్టణంలో చివరి రోజు ప్రచారం సందర్బంగా రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు జరగడం ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని కార్యాలయంలో తనిఖీలు జరగడం సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికలకు 36 గంటల సమయం ముందు వరుస దాడులు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా సత్యం న్యూస్

Satyam NEWS

రంగారెడ్డి జిల్లాకు పేరు తెచ్చిన సూర్య దీపిక

Satyam NEWS

చైనాలో ప్రమాదకర 71 రకాల వైరస్ ల కలకలం

Sub Editor

Leave a Comment