30.2 C
Hyderabad
May 17, 2024 14: 42 PM
Slider జాతీయం

నో చేంజ్:బస్సులో మహిళను వేధించిన కండక్టర్

karnataka conductor Sexual harassed a lady passenger

చట్టాలు కోర్టులు ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసిన మగాడు మారడం లేదు.కామం తో మహిళలను వేదిస్తూనేఉన్నారు.తాజాగా కర్ణాటక లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రయాణికురాలితో కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. చేయి లాగుతూ, నొక్కుతూ ఆమెకు తీవ్ర ఇబ్బంది కలిగించాడు. ఆ కండక్టర్‌ పేరు శశిహరి షాలూర్. కన్నడ జిల్లా పుత్తూరు డిపోలో పనిచేస్తున్నాడు.

పుత్తూరు నుంచి హసన్‌కు బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. బస్సులో ఆమె తప్ప ఇతర ప్రయాణికులెవరూ లేరు. ఇదే అదనుగా భావించాడు. అమాంతంగా వచ్చి ఆమె పక్కన కూర్చొని మాటలు కలిపాడు. ఏదో మామూలుగా మాట్లాడుతున్నాడులే అనుకుంది ఆమె. అక్కడితో ఆగకుండా ఆమెపై చేతులు వేయడం ప్రారంభించాడు.

వారించే ప్రయత్నం చేసినా వినకుండా అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. ఆమె తెలివిగా ఇదంతా తన ఫోన్‌లో రికార్డు చేసింది. అతని అతిని తన గమ్యం చేరేవరకు భరించింది. హసన్‌కు చేరగానే ఈ వీడియోను సోషల్ మీడియాతో పాటు, ఆర్టీసీ అధికారులకు షేర్ చేసింది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

Related posts

హెల్ప్ చేయాల్సిన హోం గార్డే బాలికను కాటేశాడు

Satyam NEWS

కరోనా కట్టడికి షిర్డీ సాయి ట్రస్టు విరాళం రూ.51 కోట్లు

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు ముక్కలు

Satyam NEWS

Leave a Comment