28.7 C
Hyderabad
May 15, 2024 02: 19 AM
Slider జాతీయం

డెడ్:స్నేహితుడి పెళ్లి వేడుకల్లో నృత్యం చేస్తూ

chattis gad youth fell down while dancing in friends marrige

స్నేహితుడి పెళ్లి వేడుకల్లో హుషారుగా నృత్యం చేస్తూ, ఉన్నట్టుండి కింద పడిపోయి యువకుడు మృతి చెందిన ఘటన ఇది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా పరిధిలో గల సరంగ్‌బుదియా ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుని పేరు వికాస్ అగర్వాల్. అతను స్నేహితులతో కలసి నృత్యం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

వికాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిశీలించి, అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కాగా సీతామడి ప్రాంతంలో వికాస్ కిరాణా దుకాణం నిర్వహించేవాడు. పెళ్ళి వేడుకలో స్నేహితులతో పాటు నృత్యం చేస్తున్న వికాస్ ఉన్నట్టుండి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్నవారు అతనిని పైకిలేపే ప్రయత్నం చేశారు. అయితే వికాస్ వారికి అచేతనంగా కనిపించాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా వికాస్ మృతి తో పెళ్లివేడుకల్లో విషాదం నెలకుంది.

Related posts

మునుగోడు లో 100కు పైగా నామినేషన్లు

Satyam NEWS

నిన్న రాజకుమారి నేడు దీపిక: దిశ యాప్ పై ఎస్పిల ప్రత్యేక శ్రద్ధ

Satyam NEWS

ప్రముఖ గాయకుడు సాయి చందు మృతి పార్టీకి తీరని లోటు

Satyam NEWS

Leave a Comment