30.2 C
Hyderabad
May 17, 2024 14: 53 PM
Slider కవి ప్రపంచం

జనహిత శోభావళి

#K.Veena Reddy Meerpet

దీపం అనగా వెలుగును పంచేదని..

దీపావళి అనగా దీపముల వరుసని..

అది నిశీధివీధిలో వెలిగే కాంతివని..అని!

అమవస నిశిలో అలరించే వెలుగులు..

అవనికి దిగిన అందాల శశి జిలుగులు!

సత్యభామాసమేత శ్రీకృష్ణ సమరం..

హరింపజేసెను లోకాల శోక తిమిరం!

అదే అదే నరకాసుర సంహారం..

జగతికి వేసిన వెలుగుల హారం!

అదే ఆదిగా అదేకదా మన దీపావళి..

పదే పదే కనేదిగా ఆనంద శోభావళి!

లక్ష్మీపూజలు, గౌరీనోముల పర్వం..

భౌతిక ఆధ్యాత్మిక సంబరాల సర్వం!

కాలుష్యాన్ని హరించే కాకరపువ్వొత్తులు..

ముచ్చటైన ముగ్గుల్లో కొలువైన దివ్వెలగుత్తులు!

అలనాటి క్షీరసాగరమథనంలో,

సిరులనొసగేటి శ్రీదేవి పుట్టినట్టు..

ఆ పుణ్యతిథి కూడా దీపావళి అయినట్టు..

ఇల.. నేటి మన మనోసాగర మథనంలో,

విశ్వశాంతి కిరణంలా ‘మంచి’ పుట్టాలి..

విశ్వకాంతి తోరణంలా దాన్ని కట్టాలి..

లోక హితమైన కార్యాల్ని చేపట్టాలి..

శోక రహితమైన దీపావళిని చూపెట్టాలి!

కె. వీణారెడ్డి, 7337058025

Related posts

కల్యాణం కమనీయం కరోనాకు ఎంతో దూరం

Satyam NEWS

క్రిటిసిజమ్: నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణ

Satyam NEWS

శ్రీవారి సేవలో సరిలేరు నీకెవ్వరూ సినీ టీమ్

Satyam NEWS

Leave a Comment