Slider సినిమా

శ్రీవారి సేవలో సరిలేరు నీకెవ్వరూ సినీ టీమ్

mahesh babu vijaya shanthi

సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రం బృందం నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులతో పాటు సీనియర్ నటి విజయశాంతి తదితరులు నేడు తిరుమల వచ్చిన వారిలో ఉన్నారు. నేటి ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఈ చిత్ర బృందం ప్రత్యేక పూజలు జరిపింది. మహేశ్ బాబు, నమ్రత, గౌతమ్, సితారలతో పాటు రాజేంద్రప్రసాద్, వంశీ పైడిపల్లి, దర్శకుడు అనిల్ రావిపూడి, ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు తదితరులు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి వెళ్లారు.

గత వారం విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆలయానికి వచ్చిన సెలబ్రిటీలకు ప్రొటోకాల్ స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, దర్శనం తరువాత వారికి తీర్థ ప్రసాదాలు అందించారు.

Related posts

తల్లిదండ్రుల యాదిలో పేదలకు ఉచిత వైద్య శిబిరం

Satyam NEWS

మునిసిపల్ ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ తాజా వల

Satyam NEWS

మాదిగల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ అవమానిస్తూన్నఎమ్మెల్యే జోగు రామన్న

mamatha

Leave a Comment