30.2 C
Hyderabad
May 17, 2024 22: 21 PM
Slider కరీంనగర్

దళితుల జీవితాల్లో ధైర్యం నింపిన దేవుడు కేసీఆర్

#ministergangula

హుజురాబాద్ లో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. హుజురాబాద్ టౌన్ కు చెందిన దళితవాడ, 12వ డివిజన్, బోర్నపల్లి, ఇందిరానగర్, బిసి కాలనీల్లో శనివారం ఉదయం మార్నింగ్ వాక్ లో మంత్రి గంగుల కమలాకర్ ప్రతీ ఒక్కరితో నేరుగా మాట్లాడారు. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ స్పూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి సాధించిన యోధుడు, దళిత, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో ధైర్యం నింపిన దేవుడు కేసీఆర్ అని మంత్రి అన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూసారని, కడుపునిండా భోజనం పెట్టలేదని తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల తమకు ధైర్యం వచ్చిందని, కుటుంబాల్ని పోషించుకునే ధైర్యాన్ని ఇచ్చారని దళితులు మంత్రి గంగులకు తెలిపారు.

తెలంగాణ రావడం వల్లే ఈ భరోసా సాధ్యమయిందని మంత్రి అన్నారు. బడుగు, బలహీన, దళిత వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించారని మంత్రి అన్నారు. దాని ఫలితమే రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు,  కాళేశ్వరం నీళ్లు, పంటల దిగుబడులు, దళిత బందు వంటి పథకాలు వచ్చాయని, తద్వారా రైతుల ఆత్మహత్యలు ఆగాయన్నారు. ఒక బిసీ బిడ్డగా బడుగు, బలహీన, ధళిత వర్గాలు ఈ రోజు కేసీఆర్ పాలన వల్లనే సంతోషంగా ఉన్నామన్నారు. ఈ అభివ్రుద్ది, సంక్షేమాన్ని ఇచ్చే ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని స్వయంగా మహిళలే ప్రతీ ఓటరును పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లి కేసీఆర్ కి మద్దతుగా గెల్లు శ్రీనివాస్ ను గెలిపించడానికి కారుగుర్తుపై ఓటేయిస్తామని మహిళలు చెబుతుండడం టీఆర్ఎస్ భారీ మెజార్టీకి నిదర్శనమన్నారు.

Related posts

ఒకేసారి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం జగన్

Bhavani

మహారాష్ట్ర రైతులకు రూ.4వేల కోట్ల విద్యుత్‌ బిల్లు మాఫీ

Sub Editor

పీ.ఎం. ఈ.జీ. పీ సేవలను మహిళలు వినియోగించుకోవాలి

Satyam NEWS

Leave a Comment