31.2 C
Hyderabad
May 3, 2024 02: 26 AM
Slider జాతీయం

మహారాష్ట్ర రైతులకు రూ.4వేల కోట్ల విద్యుత్‌ బిల్లు మాఫీ

farmers-electricity

మహారాష్ట్ర రైతులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది. 12 లక్షల రైతులకి సంబంధించిన 4000 కోట్ల విద్యుత్‌ బకాయిలను మాఫీ చేస్తామని రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ఆఫర్ ప్రకటించింది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ .. పశ్చిమ మహారాష్ట్ర రైతులు రూ.8007 కోట్ల విద్యుత్ బిల్లు బకాయి ఉందని తెలిపింది. రైతులు తమ బకాయి బిల్లులు చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది.

ఈ ఆఫర్ కింద రైతులు రూ.8007 కోట్లలో సగం అంటే రూ.4007 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ని అంగీకరిస్తే రైతులు సగం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బిల్లు పొలాల దగ్గర ఉండే బావులకి సంబంధించినవి. ఇప్పటివరకు పశ్చిమ మహారాష్ట్రలోని 5.52 లక్షల మంది రైతులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నారు. వారు బకాయి విద్యుత్ బిల్లులను చెల్లించారు.

409 కోట్ల బకాయిలపై మొత్తం రూ.359 కోట్లు డిపాజిట్ చేశారు.బిల్లు చెల్లింపులో బారామతి సర్కిల్‌ అగ్రస్థానంలో ఉందని విద్యుత్‌ సంస్థ తెలిపింది. ఇక్కడ మొత్తం 3.76 లక్షల బిల్లులు జమయ్యాయని తెలిపింది. అదే సమయంలో కొల్లాపూర్ సర్కిల్ పరిధిలో 1.42 లక్షల బిల్లులను రైతులు డిపాజిట్ చేశారు. పుణె సర్కిల్‌లోని మొత్తం 32 వేల 683 మంది రైతులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నారు.

Related posts

మున్నూరు కాపు సంఘం కాలమాని ఆవిష్కరణ

Bhavani

ఆర్ఎస్ యు 5వ మహాసభల కరపత్రం విడుదల

Satyam NEWS

పది రోజుల‌లో ఖ‌రీదైన 12 స్మార్ట్ ఫోన్ లు ల‌భ్యం…ఎలా దొరికాయంటే…?

Satyam NEWS

Leave a Comment