27.7 C
Hyderabad
April 30, 2024 08: 54 AM
Slider నెల్లూరు

అహింస అనే పదునైన ఆయుధాన్ని ప్రపంచానికి ఇచ్చిన గాంధీజీ

#vikramuniversity

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు భవన్ లో మహాత్మాగాంధీ 152 వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటాలకి రెక్టర్ ఆచార్య ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ క్రిష్ణ రెడ్డి పుల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రెక్టర్ ఆచార్య ఎం.చంద్రయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు అని అన్నారు. ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాదు, వాటిని ఉపయోగించడానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారని అన్నారు. చేత కర్రబట్టి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించినా, మగ్గం చేతబట్టి నూలు వడికినా, చీపురు అందుకొని మురికివాడలు శుభ్రం చేసినా అదే ఒడుపూ, అంతే శ్రద్ధ తో ఆయన పని చేశారని అన్నారు. ఒక్కడుగా మొదలై కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చి.. తెల్ల దొరలకు పడమర దారి చూపించారని అన్నారు.

రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ క్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ పలికిన వాక్యం “తన జీవితమే తన సందేశం” లో ఎంతో అర్థం ఉంది, మహాత్మాగాంధీ గారు ఎంతో ధనిక కుటుంబంలో జన్మించిన, దేశం కోసం సాధారణ జీవితం సాగిస్తూ దేశం కోసం నల మూలల  పర్యటించి దేశ భక్తి ని ప్రజల్లో నింపారు అని అన్నారు. మహాత్మాగాంధీ ఇరవయ్యో శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరసలో నిలుస్తారని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథానే కారణం. ప్రతి విద్యార్ధి  తన సూక్తులను పాటించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, సి డి సి డీన్ ఆచార్య విజయనంద్ బాబు,  గాంధీయన్ స్టడీస్ సెంటర్  కోఆర్డినేటర్ డాక్టర్ నీల మణీ కంట, డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ సాయి నాద్ ఎన్ యస్ యస్ సిబ్బంది స్వాతి,ఉస్మాన్, అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎస్.కోట‌,ఎల్.కోట పోలీస్ స్టేష‌న్ల ప‌రిదిల‌లో దిశ జాగృతి యాత్ర‌…..!

Satyam NEWS

కావ్య హాస్పిటల్ లో ముగిసిన హెల్త్ చెకప్ క్యాంప్

Satyam NEWS

“పఠాన్” ను అడ్డుకుని తీరుతాం: బజరంగ్ దళ్

Satyam NEWS

Leave a Comment