40.2 C
Hyderabad
May 5, 2024 15: 42 PM
Slider ప్రత్యేకం

జర్నలిస్టులపట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా?

#journalists

సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టులను అదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో జర్నలిస్టులు పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు.

టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో గాంధీ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ లోని ప్యారడైజ్ సెంటర్ ఎంజీరోడ్డులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమానికి  టీయూడబ్ల్యూజె ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ, డిప్యూటీ జనరల్ సెక్రెట్రీ విష్ణుదాస్ శ్రీకాంత్, ఐజెయూ నాయకులు నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, మాజిద్ లు తరలివచ్చారు.

ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసిన జర్నలిస్టులు తమ సమస్యలతో నివేదించిన వినతిపత్రాన్ని సమర్పించారు. కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు నెలకొరిగినా, బాధిత కుటుంబాలను అడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని జర్నలిస్టులు ఆరోపించారు.

జర్నలిస్టుల ప్రాణాలకు పాలకులు భరోసా ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వార్తలు రాస్తున్న పాత్రికేయులపై, మీడియా సంస్థలపై, పౌర హక్కుల కార్యకర్తలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్లలో బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు.

జర్నలిస్టుల ఆరోగ్య భద్రతా, ఇళ్ల స్థలాలు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజెయూ సభ్యులు మాజీద్, కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రాజేశ్, హైదరబాద్ ప్రధానకార్యదర్శి శంకర్ గౌడ్, మేడ్చల్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ రెడ్డి, బాలరాజు, నగర సభ్యులు వై.సుధాకర్, ఫోటో జర్నలిస్టు యూనియన్ నాయకులు అనీల్ లతో తదితరులు పాల్గొన్నారు.

Related posts

కౌలురైతులు సంఘటితం కావాలి

Satyam NEWS

తప్ప తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS

అంబర్పేట్ డివిజన్ లో దారుణం: జిహెచ్ఎంసి ఉద్యోగిపై దాడి

Satyam NEWS

Leave a Comment