28.2 C
Hyderabad
May 17, 2024 12: 02 PM
Slider నల్గొండ

కార్మిక హక్కులకై జులై 7న,జరిగే మహాధర్నా జయప్రదం చేయండి

#somaiah

జిల్లా లోని కార్మికశాఖ కార్యాలయాలపై సమగ్ర విచారణ జరిపి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని సూర్యాపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శాంతి స్థూపం సమీపంలో అడ్డా కార్మికులకు ఈనెల 7న, కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నా కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కార్మికులు వెల్ఫేర్ బోర్డు సంక్షేమ నిధుల కోసం దరఖాస్తు చేసుకోని సంవత్సరాలకు తరబడి ఎదురు చూస్తున్నారని,దరఖాస్తులను పరిష్కరించడంలో కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఫలితంగా గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో మూడు వేలకు పైగా పెండింగ్ క్లైమ్ లు ఉన్నాయని,తక్షణమే పరిష్కరించాలని కోరారు.అలాగే అన్ని కార్మిక సంఘాల నాయకులతో అడ్వైజర్ కమిటీని ఏర్పాటు,అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు,ఇళ్ల స్థలాలు,ప్రభుత్వ హామీ మేరకు వెల్ఫేర్ బోర్డులో నమోదైన ప్రతి కార్మికునికి మోటార్ సైకిల్,60 సంవత్సరాల దాటిన కార్మికులకు 5,000 రూపాయలు పెన్షన్,పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సాయం అందించాలని,వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమ కొరకే మాత్రమే ఖర్చు చేయాలని,డిమాండ్ల పరిష్కారం కోసం జరిగే ఈ మహాధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పతల వెంకన్న,జడ్డు బాల శౌరిరెడ్డి,షేక్ ముస్తఫా,పల్లపు రామకృష్ణ,శీలం వేణు, గుండు వెంకన్న,దారా శ్యామ్,నకరికంటి అంజయ్య,అశోక్,నజీర్,రాజు, సీతారాములు,రఫీ,సతీష్,కోటయ్య, ధరావత్ లక్ష్మి,గోమి,యాదమ్మ,సైదమ్మ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని రైస్ మిల్లు యాజమాన్యాన్ని కోరిన కార్మికులు

Satyam NEWS

సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలి

Satyam NEWS

ద్వారకా తిరుమల వేదపాఠశాల విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందచేత

Satyam NEWS

Leave a Comment