37.2 C
Hyderabad
April 30, 2024 11: 12 AM
Slider వరంగల్

సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలి

#kavita

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. ముందుగా ఆదివాసి సంప్రదాయంగా పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమ పూలు పండ్లు నూతన వస్త్రాలు బెల్లం కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ మారుమూల గ్రామమైన మేడారం లో ఆదివాసీ గిరిజన జాతర దేశానికే తలమానికం,ఈ జాతరను గిరిజనులు గిరిజనేతరులు కలిసి చేసుకోవడం,ఈ వనదేవతల  జాతర మన తెలంగాణ లో ఉండడం మన అదృష్టంగా భావిస్తునాన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నో సార్లు మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నామన్నారు.

ఇప్పటికైన కేంద్రం ప్రభుత్వం మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్  ఎంపీలు కవిత ,దయాకర్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు నాగుర్ల వెంకటేశ్వర్లు తాడ్వాయి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దండగుల మల్లయ్య బండారి చంద్రయ్య సర్పంచ్ పోరం అధ్యక్షురాలు గడ్డం అరుణ సర్పంచులు గొంది శ్రీధర్ చిడం బాబురావు ఆలేటి ఇంద్రారెడ్డి రెగ నరసయ్య కొరునిబెల్లి శివయ్య సోమ నాగమ్మ బాపిరెడ్డి పత్తి గోపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి బంగారు సాంబయ్య ,వాలియబి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

దక్షిణాదిన బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల దాష్టీకం

Bhavani

మహారాజా కళాశాల ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలి….!

Satyam NEWS

స్టోరీ బిగిన్స్: కోయంబేడు వెళ్ళిన వ్యక్తికి కరోనా

Satyam NEWS

Leave a Comment