31.2 C
Hyderabad
May 3, 2024 00: 36 AM
Slider పశ్చిమగోదావరి

ద్వారకా తిరుమల వేదపాఠశాల విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందచేత

#dwarakatirumala

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల వేద పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారికి నేడు ధృవపత్రాలను అందచేశారు. 2014 వ సంవత్సరంలో అడ్మిషన్ పొంది ఆరు సంవత్సరముల పాటు అధ్యయనం పూర్తి చేసిన 16 మంది నేడు ఈ ధృవపత్రాఅను అందుకున్నారు.

వీరంతా వేదాలు, ఉపనిషత్తులు, ఆగమ శాస్త్రాల అధ్యయనం పూర్తి చేశారు. ఈ 16 మంది విద్యార్థులకు గౌరవ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఎస్ వి  సుధాకరరావు  వేద పఠనాల అధ్యయన ధృవపత్రాలను, ఉత్తీర్ణత పత్రములను, గౌరవ పారితోషికాన్ని అందించారు.

ఈ సందర్భంగా సుధాకర్ రావు  మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత పారితోషికాన్ని, మంచి విద్యను అందిస్తున్న గొప్ప విద్యాసంస్థగా ద్వారకా తిరుమల వేద పాఠశాల ప్రసిద్ధి గాంచింది అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధ రావు  ఏ ఈ ఓ కే.యల్.యన్ రాజు,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీవి వంశీకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులందరూ  పాఠశాలలో దేవస్థానం వారిచే అద్భుతమైన రీతిలో  సౌకర్యాలు కల్పించబడుతున్నాయని,  ఈ పాఠశాలలో చదువుకుని సర్టిఫికెట్లు అందుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

దళితుల జనావాసాలలో విష సర్పాలు

Satyam NEWS

ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్ధులు

Satyam NEWS

సెంట్రల్ లైటింగ్:సర్వాంగ సుందరంగా వేములవాడ

Satyam NEWS

Leave a Comment