24.7 C
Hyderabad
May 17, 2024 01: 06 AM
Slider వరంగల్

వరద ముంపు గ్రామాలను సందర్శించిన ఎస్పీ

#MuluguSP

ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తాడ్వాయి మండలంలోని మేడారం, ఊరట్ఠం గ్రామాలని సందర్శించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల జంపన్నవాగుతో పాటు చిన్నా పెద్దా వాగులు పొంగిపొర్లడంతో ఈ రెండు గ్రామాల పొలిమేరలు వరద నీరుతో నిండిపోయాయి జలదిగ్బంధం అయ్యాయి.

ఈ సందర్భంగా ఎస్పీ సందర్శించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏ అవసరం వచ్చినా ఏ  సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉంటారని భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా  అధికారులకు వరదల సమయంలో తీసుకోవలసిన చర్యల గురించి పలు సూచనలు చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు ములుగు ఎ.ఎస్పీ సాయి చైతన్య, పస్రా సీఐ   ఎ.శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై జి.రవీందర్, తాడ్వాయి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మండపాక కల్చరల్ అసోసియేషన్ వారి సూర్య పురస్కార్ ప్రధానోత్సవం

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లా నేర స‌మాచారం క్రైమ్ ఫ‌టాఫ‌ట్..ఓ సారి చూడండి !

Satyam NEWS

థాంక్స్:బిల్‌ గేట్స్‌కు సి జిన్‌పింగ్‌ లేఖ

Satyam NEWS

Leave a Comment