28.7 C
Hyderabad
April 27, 2024 04: 34 AM
Slider ప్రపంచం

థాంక్స్:బిల్‌ గేట్స్‌కు సి జిన్‌పింగ్‌ లేఖ

china president chinping thanked bilgate

కరోనా వైరస్‌తో తీవ్రంగా నష్టపోయిన తమకు ఆపన్నహస్తం అందించిన బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సంస్ధకు చైనా అధ్యక్షులు సి జిన్‌పింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సి జిన్‌పింగ్‌ శనివారం ఆ సంస్ధకు లేఖ రాసినట్టు స్ధానిక మీడియా తెలిపింది. కష్టకాలంలో తమ దేశానికి మద్దతివ్వడమే కాకుండా, తన ఉదారతను చాటుకున్నదని సి జిన్‌పింగ్‌ తన లేఖలో పేర్కొన్నారు.

మొత్తం దేశాన్ని సమీకరించి వ్యాధిని తగ్గించడానికి, రోగులకు చికిత్స అందించడానికి ఇంతకుముందెన్నడూ లేని స్ధాయిలో చర్యలు తీసుకున్నామని, ఈ చర్యలు గణనీయమైన ఫలితాలను అందిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఇటీవల చైనాకు 100 మిలియన్‌ డాలర్ల అందజేసింది.

Related posts

హిందువుగా జీవించు

Satyam NEWS

ఫారెస్ట్ ప్లస్ 2.0 ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

9న పేదలకు భూ పంపిణి

Bhavani

Leave a Comment