37.7 C
Hyderabad
May 4, 2024 11: 07 AM
Slider ముఖ్యంశాలు

మండపాక కల్చరల్ అసోసియేషన్ వారి సూర్య పురస్కార్ ప్రధానోత్సవం

#mandapaka

మండపాక కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సూర్య పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా అమ్మా నేత్ర, అవయవ దాత వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వర్  లింగం, ఎం.వీ.కామేశ్వర రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మండపాక కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ సెక్రటరీ ఎం.వీ.సూర్య రావు అధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మనిషి చనిపోయిన తర్వాత నేత్ర అవయవాలను దానం చేయడానికి భయపడతారన్నారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత మూడు గంటల లోపు వారి అవయవ వాలను తీసుకొని జీవన్ ధారా కేంద్రానికి పంపించడం జరుగుతుందన్నారు. చాలా మందికి కిడ్నీలు, కళ్ళు అమ్ముకుంటారని అపోహాలు కలుగుతాయన్నారు. కానీ వైద్యులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి ఇలాంటివి ఉపయోగపడతాయని, అంతేకాకుండా ఇతరులకు అమలుపరచడానికి కూడా ఉపయోగ పడుతాయన్నారు. ప్రతి ఒక్కరూ చనిపోయిన తరువాత అవయవాలను దానం చేసి ఒకరి ప్రాణాలను కాపాడాలని వారు కోరారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

కరోనా ఎలర్ట్: సమిష్టి కృషితో కరోనాను తరిమికొడదాం

Satyam NEWS

Free|Sample What Happens If A Woman Takes A Male Enhancement Drug

Bhavani

32,080 క‌రోనా పాజిటివ్‌, 402 మృతులు

Sub Editor

Leave a Comment