30.2 C
Hyderabad
May 17, 2024 21: 34 PM
Slider మహబూబ్ నగర్

ప్రజా పంథా పార్టీ నాయకుల అరెస్టును ఖండించండి

#prajapandha

నారాయణపేట పట్టణానికి సమీపంలో చిట్టెం నర్సిరెడ్డి కాలనీ నిరుపేదలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలు వారికే చెందాలని,  వారికి కేటాయించిన స్థలాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి కేటాయించటం సరియైనది కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిల లబ్ధిదారులు నివాసం ఉండేందుకు గుడిసెలు వేసుకుంటూ ఉంటే, వారి స్వాధీనంలో నుండి వారిని వెళ్లగొట్టేందుకు ప్రభుత్వ అధికారులు పోలీసు బలగాలని మోహరించి భయభ్రాంతులను గురిచేశారు.

వారికి అండగా నిలిచిన సిపిఐ (ఎం.ఎల్ -ప్రజా పంథా) నారాయణపేట డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ ,పట్టణ కార్యదర్శి కెంచె నారాయణ ,మండల కార్యదర్శి B.నరసింహ,AIPKMS జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,మైనార్టీ కాలనీ సాధన సమితి నాయకులు మహ్మద్ సలీంలను  అరెస్టు చేసి ఉట్కూరు పోలీస్ స్టేషన్కు తరలించడం అక్రమమైనదని , పోలీసు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని,సిపిఐ (ఎం.ఎల్- ప్రజాపంథా )పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి  B. రాము, జిల్లా నాయకులు కాళేశ్వర్, మక్తల్ డివిజన్ కార్యదర్శి సలీమ్ అన్నారు. డివిజన్ నాయకులు వెంకటరెడ్డి ,ఐఎఫ్టియు జిల్లా  అధ్యక్షులు కిరణ్,pyl జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దు, ఉట్కూరు పోలీస్ స్టేషన్ లో అరెస్టు అయిన నాయకులను పరామర్శించారు. నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మ కాలనీ వాసులది న్యాయమైన డిమాండ్ అన్నారు.

వారికి ఇండ్ల స్థలాలు  నిర్మించుకునేందుకు ప్రభుత్వము ఆటంకాలు చేయకుండా వారికే వదిలివేయాలని, పేద ప్రజలపై పోలీసు నిర్బంధం ఆపివేయాలని డిమాండ్ చేశారు.

Related posts

పకడ్బందీగా ఎస్ఐ రాత పరీక్ష ప్రారంభం…!

Satyam NEWS

కిటకిటలాడుతున్న పశ్చిమగోదావరి శైవ క్షేత్రాలు

Satyam NEWS

వ్యత్యాసం..

Satyam NEWS

Leave a Comment