కార్తీక మాస మూడో సోమవారం కావటంతో పశ్చిమగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. భీమవరం, పాలకొల్లు పంచరామాలలో ఉదయం నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్ని దేవాలయాల వద్దా భక్తులు బారులుతీరి ఉన్నారు. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చిన మూడోవ సోమవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నదీ తీరాలలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తుల శివనామ స్మరణలు మారుమోగుతున్నాయి. నరసాపురం వశిష్ఠ గోదావరి నది లో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. వలందర్ ఘాట్ లో పుణ్య స్నానాలు చేసి కార్తీక దీపాలను వదులుతున్నారు.
previous post