41.2 C
Hyderabad
May 4, 2024 15: 30 PM
Slider కవి ప్రపంచం

వ్యత్యాసం..

#Devalapally Sunanda

ఆనాడు

సురాసురులు

మంచీ చెడులకు

ప్రతీకలు

మనిషిని నరకయాతన పెట్టి

మంచితనాన్ని మట్టుబెడుతుంటే

నరకాసురుణ్ణి సంహరించి

చెడుపై విజయం సాధించి

చిరుదివ్వెలు వెలిగించి

అమావాస్య చీకట్లను

పారద్రోలి

దీపావళి పండుగను

ఆనందోత్సాహాలతో

జరుపుకున్నారు

నేడు

అవి రెండూ

విడివిడిగా లేనేలేవు

మనిషిలోనే

మంచీ చెడులు

దాగున్నాయి

మేకవన్నె పులిలా

తేనెపూసిన కత్తిలా

మనిషి

మంచితనం

ముసుగేసుకున్నాడు

మంచిని ముంచేస్తున్నాడు

 చెడుపై మంచి విజయాన్ని సాధించాలంటే

ఎవరిపై వారే పోరాటం చేయాలి

మనలో మంచిని మనమే పెంచుకోవాలి

చెడును తుంచు కోవాలి

ఎటు చూసినా

చెడు రాజ్యమేలుతోంది

మంచిని అణగదొక్కుతూ

పైచేయి నాదేనంటూ

వికటాట్టహాసం చేస్తోంది

ప్రతియేడు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా

దీపావళి జరుపుకుంటున్నామే కానీ

చెడును సమాజం నుంచి తరమలేకున్నాం

చెడుకు అంతమే లేదేమో

రావణకాష్టంలా ఎప్పటికి ప్రజ్వరిల్లుతూనే ఉంటుందేమో

దేవలపల్లి సునంద, రంగారెడ్డి జిల్లా, 8297744716

Related posts

కేంద్ర బ‌డ్జెట్ ను నిర‌సిస్తూ….ఈ నెల 10 న విజ‌య‌వాడ‌లో సద‌స్సు..!

Satyam NEWS

విద్యార్థులు చలికి వణుకుతున్నా ప్రభుత్వం అధికారులు చెలించరా

Satyam NEWS

విపత్కర పరిస్థితులలో కూడా సంక్షేమ పథకాలు ఆగవు

Satyam NEWS

Leave a Comment