Slider ముఖ్యంశాలు

జి.ఓ. నెంబర్ 3పై ప్రభుత్వం తక్షణమే రివ్యూ పిటిషన్ వేయాలి

#LambadaHakkulaSamithi

జి.ఓ నెంబర్ 3 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలలో నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ తెలిపారు. ఈ మేరకు లంబాడ హక్కుల పోరాట సమితి పిలుపు ఇచ్చిందని ఆయన తెలిపారు.

అదే విధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసును ప్రత్యేక బెంచికి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని అన్నారు.

లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు తేజావత్ బెల్లయ్య నాయక్, భూక్య సంజీవ్ నాయక్ ఆదేశానుసారం  ప్రతి గిరిజన తండాలో ఇంట్లోనే ఉండి ప్లకారుడుల ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Related posts

లక్కీ ఛాన్స్: భీరంగూడా నుంచి భార్యాభర్త

Satyam NEWS

టిడిపి కట్టిన బిల్డింగులకు రంగులేసుకుంటున్నారు

Satyam NEWS

గుడ్ వర్క్: పేదల ఆకలి తీర్చడమే ప్రధాన ఎజెండా

Satyam NEWS

Leave a Comment