32.7 C
Hyderabad
April 26, 2024 23: 29 PM
Slider ఆదిలాబాద్

లిక్కర్ స్కాం: ఏరులైపారుతున్న మధ్యప్రదేశ్ మద్యం

#Kagaznagar liquor mafia

లాక్ డౌన్ నేపథ్యంలో మద్యానికి ఉన్న డిమాండ్ ను అదనుగా చేసుకుని పక్కరాష్ట్రాల నుంచి భారీగా మందు స్మగ్లింగ్ జరుగుతున్నది. ఈ దందా కొమురంభీం జిల్లాలోని చాలా ప్రాంతాలలో జరుగుతున్నది. తాజాగా  కాగజ్ నగర్ పట్టణంలో ఎక్సయిజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లు పట్టుపడ్డాయి.

సంచలనం కలిగించిన మధ్యప్రదేశ్ మద్యం

మద్యం స్మగ్లింగ్ విషయంలో ఎక్సయిజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మధ్య ప్రదేశ్ నుంచి వస్తున్న లారీలో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు దొరకడం ఇక్కడ సంచలనం కలిగించింది. దాంతో లారీ తో బాటు తొమ్మిది మందిని ఎక్సయిజ్ పోలీసులు పట్టుకున్నారు.

మధ్యప్రదేశ్ నుండి లారీలో అక్రమంగా కాగజ్ నగర్ కు మద్యాన్ని కొంత మంది స్మగ్లింగ్ చేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పెద్ద ఎత్తున తనిఖీలు జరిపామని ఎక్సయిజ్ సిఐ మహేందర్ సింగ్ తెలిపారు. 

ఈ తనిఖీలలో కాగజ్ నగర్ ఎక్సైజ్ సీఐ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సిఐ లతీఫ్, కాగజ్ నగర్ సిఐ మహేంద్ర సింగ్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కంభంపాటి అవినాష్, సంజయ్ సర్కార్, రాచర్ల వినయ్, అంగళ శ్రీకాంత్, పొట్టి గోపాల్, సాదిక్ హుస్సేన్, సాదుల సుమన్, కుల్దీప్ మండల్,గొర్ల కృష్ణ లు మినీ లారీ లో మద్యం తీసుకువస్తూ పట్టుబడ్డారని సిఐ మహేందర్ సింగ్ తెలిపారు.

సహకరించిన స్థానిక మద్యం దుకాణం వర్కర్

వీరందరూ ముఠా గా ఏర్పడి రవీంద్ర నగర్ కు చెందిన మద్యం దుకాణం లో పనిచేసే వ్యక్తి తో కలిసి వీరు మద్యాన్ని దిగుమతి చేసినట్లు సిఐ తెలిపారు.180 ఎంఎల్ గల 184 బాటిల్ లు, 750 ఎమ్ ఎల్ గల 15 ఫుల్ బాటిల్ లను పట్టుకున్నామని ,వీటిని కాగజ్ నగర్ లోని రిక్షా కాలనీ తో పాటు వేంపల్లి శివారులో దాచి ఉంచగా స్వాధీన పరుచుకున్నమన్నారు.

పిడీ కేసులు నమోదు చేస్తాం

ఈ మేరకు సంబంధిత వ్యక్తులపై పి డి కేసులను నమోదు చేయడంతోపాటు లాక్ డౌన్ ల నిబంధనల అతిక్రమణ మేరకు కూడా కేసులు నమోదు చేయనున్నట్లు సిఐ తెలిపారు. చట్టవ్యతిరేకమైన చర్యలు చేపట్టే వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. గ్రామాల్లో ,బెల్టుషాపులు, గుడుంబాలు తీసే వారిని కూడా త్వరలోనే పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సోమవారం రోజు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో తెలిపారు.

ఇదే కాకుండా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నందున ఎక్సయిజ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts

ఎలారమింగ్: ఆదిలాబాద్ లో విచ్చలవిడిగా నిషేధిత గుట్కా

Satyam NEWS

టీయూడబ్ల్యూజేతోనే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు

Satyam NEWS

వచ్చే నెల లో ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment