28.2 C
Hyderabad
May 17, 2024 12: 41 PM
Slider నిజామాబాద్

సమస్యలు పరిష్కరించండి: సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల వేడుకోలు

#contractemployees

తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నేడు ర్యాలీగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ గారూ.. మీకు చేతులెత్తి మొక్కుతున్నాం.. అందరి సమస్యలు పరిష్కరిస్తూ మమ్మల్ని మర్చిపోయారు.. మమ్మల్ని కూడా పట్టించుకోండి సార్ అని వేడుకున్నారు. గత 15 సంవత్సరాలుగా తాము చాలీచాలని వేతనాలతో శ్రమదోపిడికి గురవుతున్నామన్నారు. విద్యాశాఖలో తాము కీలకంగా పనిచేస్తున్నామని తెలిపారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం అందించాలని, 5 లక్షల ఆరోగ్య భీమా వర్తింపజేయలని కోరారు. తమ చేతిలో 10 లక్షల ఓట్లు ఉన్నాయని, తమ డిమాండ్లు పరిష్కరించాలని, మళ్ళీ ఓటేసి గెలిపించుకుంటామన్నారు. లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Related posts

మైనాస్వామికి అరుదైన గుర్తింపు

Satyam NEWS

ఎర్రగడ్డ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు

Satyam NEWS

రాయలసీమ ప్రాజెక్టులకు బాసటగా నిలవండి…ప్లీజ్

Satyam NEWS

Leave a Comment