40.2 C
Hyderabad
May 6, 2024 15: 22 PM
Slider ఖమ్మం

రక్త హీనత లోపo లేకుండా చర్యలు

#T. Suma

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్బీణీలు, బాలింతలకు నాణ్యమైన సేవలు అందించి రక్తహీనత లోపంకు గురికాకుండా చూడాలని జిల్లా సంక్షేమ శాఖాధికారి టి.సుమ జిల్లా పోషణ అభియాన్‌ సిబ్బందిని ఆదేశించారు. ఐడిఓసి జిల్లా సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో జిల్లాలోని ప్రాజెక్టుల పోషణ అభియాన్‌ బ్లాక్‌ కోఆర్డినేటర్లతో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమ అమలు పురోగిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని అంగనవాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు, ప్రతి నెల విధిగా అంగన్వాడి కేంద్రాలలో నమోదైన పిల్లల ఎత్తు బరువులు చూసి అతి తీవ్ర పోషణ లోపం, తీవ్ర పోషణ లోపం, పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి అదనపు పోషకాహారం అందజేస్తూ సూపర్వైజర్‌ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలన్నారు.

జిల్లా కలెక్టర్‌ గారి ఆదేశానుసారం ప్రతి శుక్రవారం పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారులను స్థానిక వైద్యశాలలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని అప్పటికి మెరుగైన ఫలితాలు రానిపక్షంలో న్యూట్రిషన్‌ రియాబిటేషన్‌ సెంటర్‌ కి పంపే విధంగా తల్లితండ్రులను ఒప్పించాలన్నారు.

గర్భిణీలు, బాలింతలు మరియు ఆరేళ్లలోపు చిన్నారులను రక్తహీనత లోపంతో బాధపడకుండా ఉండేందుకు వైద్యఆరోగ్య శాఖ సమన్వయంతో నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఉన్న 1840 అంగన్వాడి కేంద్రాలలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారంతో అంగన్వాడీ కేంద్రాలలో పెరటి తోట పెంపకాలు చేపట్టి పౌష్టిక విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తూ తద్వారా కలిగే లాభాలు తెలియజేయాలని చెప్పారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో 1910 4జి స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని గతంలో ఉన్న లిఖితపూర్వక రిజిస్టర్లను రద్దు చేస్తూ ఆన్లైన్‌ పద్ధతిలో నమోదు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారని పోషణ ట్రాకర్‌ అప్లికేషన్‌ మరియు న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం లో లబ్ధిదారుల సంఖ్య సమాంతరంగా ఉండాలని పోషణ ట్రాకర్‌ అప్లికేషన్‌ అనేది జాతీయ స్థాయిలో వినియోగించేది కాబట్టి అప్పుడప్పుడు

సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతాయని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.అంతకు మందు జిల్లా పోషణ అభియాన్‌ సిబ్బంది నూతనంగా నియమితులైన జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి టి.

సుమను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.సమీక్షా సమావేశంలో పోషణ అభియాన్‌ జిల్లా సమన్వయకర్త పొనుగోటి సంపత్‌ బ్లాక్‌ కోఆర్డినేటర్లు లలిత, శ్యామిలి, హరీష్‌, ప్రసాద్‌, రమేష్‌, సితార, జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కోటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కౌలురైతులు సంఘటితం కావాలి

Satyam NEWS

అత్యవసర చికిత్సపై అరుణ్ జైట్లీ

Satyam NEWS

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్?

Satyam NEWS

Leave a Comment