34.2 C
Hyderabad
May 19, 2025 17: 30 PM
కవి ప్రపంచం

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!

#Vadaparty Venkataramana

అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ

పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ

పేరులెన్నివున్నా ప్రాంతాలు వేరైనా

ముమ్మూర్తులా తెలుగునాట

వెలసినావు దేవతాస్వరూపిణివై!

ఆషాఢ మాసాన బోనాలంటే

అమ్మకు అమితంగా ఇష్టమంట

అన్నం పాలు పెరుగు బెల్లం కలిపి

మట్టికుండలో నైవేద్యం మరెంతో మక్కువంట

ఢమ ఢమ డప్పుల మోతలతో

పోతురాజు నృత్య విన్యాసాలతో

నెత్తిన బోనమెత్తిన మహిళలు

ఆలయానికి తరలిపోతుంటే

తన్మయత్వంతో మురిసెను తెలంగాణం

వ్యాధులేవీ సోకకుండా వేపకొమ్మలు

క్రిమి కీటకాలు రాకుండా పసుపు కుంకుమలు

శాస్త్రీయతకిది చక్కని నిదర్శనం!

చల్లని తల్లి కరుణచూపే కల్పవల్లి

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!!

వాడపర్తి వెంకటరమణ, శ్రీకాకుళం జిల్లా, చరవాణి : 81795 78895

Related posts

స్థిత ప్రజ్ఞుడు

Satyam NEWS

నిండైన మూర్తిమత్వం

Satyam NEWS

సార్థ‌క ఉగాది…

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!