38.2 C
Hyderabad
May 5, 2024 20: 35 PM
Slider కవి ప్రపంచం

అచ్చమైన పల్లె సంక్రాంతి

#KolipakaSrinivas

రంగు రంగుల హంగులతో

సక్కనైన సంక్రాంతి సంబురాలు

అంబరాన్ని తకుతున్నాయి…

ప్రతి పల్లె పులకిస్తుంది

అచ్చమైన తెలుగు తల్లి

పచ్చని వనాన్ని పుణికిపుచ్చుకొని

సంక్రాంతి పల్లెకు హారతియై…

సుదూరంలో వున్న కన్న బిడ్డల

మృదువైన పాదాలను సుతారంగా

ముద్దాడుతుంది -పల్లె-మల్లోక్కమారు..!

ఊరికి ఉత్సవాలు తెస్తున్న..

కన్న బిడ్డలను చూచి

నేల తల్లి పరవశించింది

కనుమ కనువిందులు చేస్తుంది

చిన్ననాటి చిలిపి అల్లర్లు మదికి మధురానుభూతినిస్తున్నాయి..!

నది తీరాన చెట్టుపై… కోకిల కూ కూలు..

పక్షల కిలకిలారావాలు..

పచ్చదనాన్ని పరుచుకున్న..

పొలాల పైరు గాలితో మంచు తుంపరులు…

తనవుకు తాకి తన్మయత్వంతో

ఊరకలు వేస్తుంది యావత్తు ఈ సృష్టి….!

నూను నూగుగా

తెలతెలవారే పొగమంచులు….

మయిమరింవించే జ్ఞాపకాలు

నూతనోత్సాహంతో..మదిని ముంచేస్తున్నాయి..

పొద్దు పొడవక  ముందే

భోగి స్నానాల భోగములు..

ముగ్గులతో ముంగిళ్ళు

ముచ్చటగా ఎదను మురిపిస్తున్నవి..!

నేల నిండా పరుచుకున్న

పచ్చదనమును  చూస్తే.

పసిపాపను మనసారా ముద్దాడిన

తల్లి వల్లే వుంది ఈ పల్లె…!

కొలిపాక శ్రీనివాస్,  9866514982

Related posts

జెర్సీ ఆవుకు ఓకే కాన్పులో నాలుగు దూడలు

Bhavani

గణనీయంగా తగ్గనున్న మందుల ధరలు

Satyam NEWS

ఎటాక్: కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ మతాన్ని కించపరిచారు

Satyam NEWS

Leave a Comment