28.7 C
Hyderabad
May 5, 2024 07: 21 AM
కవి ప్రపంచం

పి. వి. తెలంగాణ జీవి

#Jayakar Rapolu

పాములపర్తి వెంకట నరసింహారావు

తెలంగాణ నేల నోచిన నోము ఫలం

వరంగల్లు జిల్లా నర్సంపేట మండలం

లక్నెపల్లి గ్రామంలో పురుడు పోసుకుని

వంగర గ్రామ వాసి పాములపర్తి వెంకట సీతారామారావు దంపతులకు

దత్త పుత్రుడై నాగపూర్ విశ్వ విద్యాలయం నుండి లా పట్టా పొంది రాజకీయాలలో రాటు తేలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రియై

భారత దేశ ప్రదాన మంత్రి పదవిని

చేతబూనిన తొలి తెలుగు వాడై

గురుకుల ఆశ్రమ, నవోదయ విద్యా లయాలకు నాంది పలికి

గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థలో

విప్లవాత్మక సంస్కరణలను ఉదయింపచేసి,

తెలుగు అకాడమీ స్థాపకుడై, వేయి పడగలు పుస్తకాన్ని సహస్రఫట్ గా

హిందీ బాషలోకి అనువదించిన గొప్ప

సాహితీవేత్త, మహా మేధావి, స్థితప్రజ్ఞుడు, నిరాడంబరత, నిజాయితీ కలిగిన ధీరోదాత్తుడు పి. వి.

దేశ చరిత్రలో కలకాలం నిలిచి పోయిన తెలంగాణ తేజం

జయాకర్ రాపోలు, నల్లగొండ, చరవాణి: 9963581382

Related posts

మేమిట్లాగే ఉంటాము గాంధీ ‘జీ’

Satyam NEWS

లోపలి మనిషి!

Satyam NEWS

ప్రేమంటే

Satyam NEWS

Leave a Comment