34.7 C
Hyderabad
May 5, 2024 01: 51 AM
కవి ప్రపంచం

అంబాసిడర్

#Singaraju Srinivasarao

అమ్ములపొదిని భుజాన వేసుకుని

ప్రకృతి వొడిదుడుకులను లెక్కచేయక

తదేకదీక్షతో సాగిపోతున్నాడు

తూరుపు తెరలు తొలగకముందే

సూదంటు చూపులతో దూసుకుపోతూ

విషపు మూలాలను వొడిసిపడుతున్నాడు

అవిశ్రాంత నడకను సాగిస్తూ

వదలివేసిన, విసరివేసిన

ప్లాస్టిక్ భూతాలను పొదిలో కుక్కుతున్నాడు

మన సంస్కారం విసరిన అహంకార మకిలిని

విశ్వప్రేమికుడై తొలగించి తన వీపున తగిలించుకుని

స్వచ్ఛభారత్ సైనికుడై కదులుతున్నాడు

పిడికెడు ముద్దకోసం అశుద్ధాన్ని శుద్ధిచేస్తూ

అవని గర్భాన ప్లాస్టిక్ విషం చేరకుండా

అహర్నిశలు అశ్వమేథయాగం చేస్తున్నాడు

అతనొక నిరంతర శ్రామికుడు

నేలన కలుపును తొలగించే కర్షకుడు

చేతలతోనే కర్తవ్యాన్ని చూపుతున్న దార్శినికుడు

పర్యావరణ రక్షణకై కదులుతున్న శకటం అతను

పరిశుభ్రతకై నడుము కట్టిన శ్రమజీవి అతను

అవార్డుకోసం చూడని స్వచ్ఛభారత్ అంబాసిడర్ అతను

శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు, మొబైల్ నెం. 9052048706

Related posts

స్మరణ

Satyam NEWS

ఆమె

Satyam NEWS

2021

Satyam NEWS

Leave a Comment