28.2 C
Hyderabad
May 17, 2024 12: 23 PM
Slider కవి ప్రపంచం

ఆనందం

#Devalapally Sunanda

వాళ్ళను అడిగా

వీళ్ళను అడిగా

అక్కడ వెతికా

ఇక్కడ వెతికా

ఎక్కడెక్కడో వెతికా

కనిపించిన అందరిని అడిగా

కనిపించని ఆ దేవుడినడిగా

అయినా దొరకనేలేదు

చివరికి విసుగుచెంది

బయట వెతకడం మానేశా

నన్ను నేను అడిగా

నాలో నేను వెతికా

అదిగో అప్పుడు దొరికింది

నా పెన్నిదిలా ఆనందం

ఆ ఆనందం

మన మనసులోనే ఉంటుందని

మన ఆలోచనలతో పాటే

పెరుగుతూ తరుగుతూ ఉంటుందని

ఈ నాడే తెలుసుకున్నా

నా మనసులో

ఆనందాల తోట పెంచుతున్నా

సంతోష ఫలాలు

అందరికి పంచిపెట్టబోతున్నా..

దేవలపల్లి సునంద, 9291599562

Related posts

తహసీల్దార్ విజయను కాల్చేసిన సురేష్ మృతి

Satyam NEWS

దేశం గర్వపడేలా చేసింది బిజెపి : నూనె బాల్‌రాజ్

Satyam NEWS

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అరెస్టు

Satyam NEWS

Leave a Comment