తహసీల్దారు విజయరెడ్డిని కార్యాలయంలోనే పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన సురేష్ ఉస్మానియా ఆసుపత్రిలో తుది శ్వాస తీసుకున్నాడు. విజయారెడ్డిని హత్య చేసే క్రమంలో మంటలు అంటుకుని సురేష్ 65 శాతం శరీరం మేరకు కాలిపోయింది. ఈ నెల నాలుగో తేదీ మధ్యాహ్నం తహసీల్దార్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆమెను కాపాడేందుకు వెళ్లి మంటల్లో చిక్కుకున్న ఆమె డ్రైవర్ గురునాథం కూడా ఇప్పటికే మరణించారు. ఈ కేసులో నిందితుడు సురేష్ ఒంటిపై 65 శాతం కాలిన గాయాలతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా మేల్ బర్నింగ్ వార్డులో చికిత్స పొందాడు. నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ ఇప్పటికే డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. సురేష్ న్యూరో బర్న్ షాక్ లోకి వెళ్లిన సరేష్ ట్రీట్ మెంట్ కు స్పందించకపోవడంతో స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్లాడు. ఉస్మానియా వైద్యులు పోలీసుల సమక్షంలో ఫ్లూయిడ్స్ ఇస్తూ చికిత్స అందించారు. అయితే అతను కోలుకోలేదు. నేటి ఉదయం మరణించాడు. సురేష్ గౌరెల్లిగ్రామానికి చెందిన వాడు.
previous post