38.2 C
Hyderabad
May 5, 2024 22: 16 PM
Slider ప్రత్యేకం

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అరెస్టు

Tabligi Jamath

నాటకీయ పరిణామాల మధ్య తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదనే విషయాన్ని సత్యం న్యూస్ మూడు రోజుల కిందట ఎత్తి చూపిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించిన కేసు ఇతనిపైనా మరో ఆరుగురు పైన ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, వారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మార్చి 28 నుంచి మౌలానా సాద్ పరారీలో ఉన్నాడు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు కారకులనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను ఎగతాళి చేస్తూ మరణం అల్లా అనుమతితో జరుగుతుంది.

అల్లా ఆపాలనుకుంటే మనం చచ్చిపోతామా? అల్లా చంపాలనుకుంటే వీళ్లు బతికిస్తారా? అంటూ ఆడియో టేపులు కూడా సాద్ విడుదల చేశాడు. తాను కూడా కరోనా బాధితుడినేనని, సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నానని మౌలానా ప్రకటించుకున్నాడు. ఇతని కోసం పోలీసులు ఢిల్లీలోని తజీమ్ ఘర్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల గాలిస్తూ వచ్చారు. చిట్టచివరకు అతడిని అరెస్టు చేశారు.

Related posts

రోబోటిక్స్ పై సీబీఐటి లో ఆన్ లైన్ కాన్ఫరెన్స్

Satyam NEWS

పండుగలా సాగిన ఆరవ విడత హరితహారం

Satyam NEWS

పుడమిని నమ్ముకున్న రైతుకు మరణమే శరణ్యమా?

Satyam NEWS

Leave a Comment