28.2 C
Hyderabad
May 17, 2024 12: 24 PM
Slider మహబూబ్ నగర్

పోలీస్ సర్కిల్ ఆఫీసును  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

#wanaparthySP

వార్షిక తనిఖీల్లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి,ఐపీఎస్ వనపర్తి వలయా అధికారి(పోలీస్ సి ఐ) కార్యాలయాన్ని సందర్శించి సర్కిల్ పరిధిలో  పరిసరాలను, రికార్డ్స్ ను మరియు సర్కిల్ ఆఫీసులో  సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేసి పరిశీలించారు. అందులో భాగంగా ముందుగా గౌరవ వందనం స్వీకరించి    పోలీస్ స్టేషన్  ఆవరణలో మొక్కలు నాటి, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు. ఆయా కేసులలో పట్టుబడిన వాహనాలు, ఇతర ప్రాపర్టీని పరిశీలించారు. ఆయా వాహనాలు వివరాలను, కేసుల స్థితి గతులను సీఐ  మహేశ్వరరావు  ఎస్పీకీ వివరించారు. 5ఎస్ అమలు తీరును పరిశీలించారు. సర్కిల్ ఆఫీసులో రోజు వారీగా నిర్వహిస్తున్న గవర్నమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్, క్రైమ్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఆర్మ్స్ రిజిస్టర్, ఆర్టిఐ రిజిస్టర్,కోర్ట్ క్యాలెండర్,ఓయీ రిజిస్టర్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలో నమోదయిన గ్రేవ్ కాసెస్ యొక్క సిడి ఫైల్స్ ను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని, అయా కేసులలో పట్టుబడిన ప్రాపర్టీ నీ కోర్టులో డిపాజిట్ చేసి, క్లోజ్ అయిన కాసెస్ లో కోర్ట్ అనుమతితో డిస్పోసల చేయాలని సీఐకి సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ   సిబ్బందితో మాట్లాడుతూ సర్కిల్ ఆఫీస్ నందు 5ఎస్ ను ఎవరి పరిధిలో వారు నిత్యం అమలు అయ్యేటట్లు చూసుకోవాలని, స్టాఫ్ కు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. మహిళ అధికారులకు రెస్ట్ రూమ్ సౌకర్యాల  గురించి అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ ఆఫీసులో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. 

సర్కిల్  పరిధిలో ఎక్కువగా  ఎలాంటి కేసులు నమోదు అవుతున్నాయో  పరిశీలించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ల నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, తెలుసుకుని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది అందరూ బాధ్యత యుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని,   జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ ఆనంద రెడ్డి, వనపర్తి సర్కిల్ పరిధిలో గల ఎస్ఐలు, సి.సి మధు,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

విజయనగరంలో ముగిసిన ఏబీవీపీ మహా సభలు

Satyam NEWS

హ్యాట్సాఫ్ : ఉదారత చాటుకున్న అక్క చెల్లెళ్లు

Satyam NEWS

స్కందమాత అలంకారంలో శ్రీశైల భ్రమరాంబదేవి

Satyam NEWS

Leave a Comment