28.2 C
Hyderabad
May 17, 2024 12: 41 PM
Slider ఖమ్మం

ప్రీతి మృతికి కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి

#congress

ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్నం చేసిన కేఎంసి పిజి విద్యార్థిని ప్రీతి ఐదు రోజులపాటు పోరాడుతూ మృతి చెందడం చాలా బాధాకరమని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బుల సౌజన్య  అన్నారు,  జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత మాట్లాడుతూ ప్రీతిని వేధించిన మృతికి కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన కుటుంబానికి చెందిన ప్రీతి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ప్రతిష్టాత్మక వైద్య విద్యను కొనసాగిస్తూ  సైఫ్ వేధింపులకు తాళలేక ఇలా నిస్క్రూమించడం  చాలా విషాదకరం, సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నారని ప్రీతి పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని కేఎంసి ప్రిన్సిపాల్ హెచ్ ఓ డి మరియు స్థానిక పోలీసులు విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నియంత్రించలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ మృతికి పూర్తి బాధ్యత వహించాలని  అన్నారు.

ఉన్నత విద్యారంగంలో అట్టడుగు  వర్గాల విద్యార్థులకు ప్రవేశించడానికి జీవించలేకపోతున్నారు సామాజిక సృహ లేని కొన్ని ఉన్నత విద్యాసంస్థలు కుల వివక్షత కేంద్రాలుగా మారిపోయాయని ఈ నేర సంస్కృతిని పెంచి పోషించిన కాకతీయ మెడికల్ కళాశాల పాలన అధికారులు సరైన పర్యవేక్షణలో చేయకుండా ఏసీ గదుల్లో కూర్చుని మెడికల్ కళాశాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న కాళోజి హెల్త్ యూనివర్సిటీ అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని  డిమాండ్  చేశారు, ప్రీతి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల ఎక్స్గ్రేషియా కాదు ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రీషియా అందించాలని డిమాండ్ చేశారు, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సభ్యులు మహమ్మద్ జావిద్  మాట్లాడుతూ ప్రీతి కుటుంబానికి సహాయ సహకారాలు అందించి అన్ని రకాలుగా ఆదుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు   ఈ కార్యక్రమంలో  టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరావు, టిపిసిసి సభ్యులు ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, టిపిసిసి సభ్యులు వడ్డే నారాయణరావు , ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, సిటీ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related posts

న్యూమాంక్స్ కుంగ్ ఫు అసోసియేషన్ గౌరవ సలహాదారు గా రావుసుబ్రహ్మణ్యం

Satyam NEWS

ఏపీ రాజధాని అంశంపై అక్టోబర్‌ 5 వరకు స్టేటస్‌కో

Satyam NEWS

దేశ సమైక్యతకు పి.వి ఎనలేని కృషి

Satyam NEWS

Leave a Comment