28.2 C
Hyderabad
May 17, 2024 12: 42 PM
Slider ఖమ్మం

సాగర్ నీరు సమృద్ధిగా ఇవ్వాలి

#nunna

జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందాల్సిన సాగర్ జలాలను సమృద్ధిగా ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. స్థానిక మంచి కంటి సమావేశ మందిరంలో  నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో నున్నా మాట్లాడారు. విడతల వారీగా నీరు ఇవ్వడం వల్ల చివరి ఆయకట్టులో పంటలు ఎండుతున్నాయన్నారు. 6000 క్యూసెక్కుల నీరు వదలాల్సి ఉండగా రెండున్నర వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారని తెలిపారు. జిల్లా మంత్రి జోక్యం చేసుకొని సరిపడా నీరు అందేలా చూడాలన్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల తీసివేతను వ్యతిరేకించారు. కేంద్రం సహకార రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతకుముందు పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి ప్లీనం సంతాపం తెలిపింది. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, వై. విక్రమ్, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు, చింతలచెరువు కోటేశ్వరరావు, బుగ్గ వీటి సరళ, పార్టీ సీనియర్ నాయకులు ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిలో సీఎం జగన్ తో సినీ నటుల భేటీ

Satyam NEWS

New year special: తాగి వాహనాలు నడిపితే తాటతీస్తాం

Satyam NEWS

అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా చమర్తి

Satyam NEWS

Leave a Comment