28.2 C
Hyderabad
May 17, 2024 13: 03 PM
Slider ముఖ్యంశాలు

3 వ తేది నుంచి టీచర్స్ బదిలీలు

#School Education

ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లపై ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన పంపించారు. ఈ ప్రతిపాదనలో షెడ్యూల్ తేదీలను సైతం ప్రకటించారు. ఈ నెల 3 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్లు పదోన్నతులు బదిలీలు కోరుకుంటున్న వారు ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. 6,7 తేదీల్లో ఆన్ లైన్ అప్లికేషన్ కాపీలను డీఈవో కార్యాలయంలో ఇవ్వాలి.

8, 9 తేదీల్లో దరఖాస్తు చేసిన వారి పేర్లను డిస్‌ప్లే చేస్తారు. 10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరిస్తారు. 12,13 సీనియారిటీ జాబితా డిస్‌ప్లే చేస్తారు. 14న ఎడిట్‌ చేసుకునేందుకు ఆప్షన్‌ ఇస్తారు. సెప్టెంబర్ 15న ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరుపుతారు. 16న ప్రధానోపాధ్యాయుల ఖాళీ ల ప్రదర్శన, 17,18,19 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంలుగా ప్రమోషన్స్ ఇస్తారు. 20,21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ను డిస్ ప్లే చేస్తారు.

21న వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 22న ఎడిట్‌ ఆప్షన్‌ అవకాశం కల్పిస్తారు. 23,24 స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలు జరుగుతాయి. దానికనుగుణంగా 24 స్కూల్‌ అస్టింట్‌ ఖాళీ లు వెల్లడిస్తారు. 26,27,28 ఎస్జీటీనుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు ఇస్తారు. 29,30,31 SGT ఖాళీల ప్రదర్శన, అక్టోబర్‌ 2న ఎడిట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. అక్టోబర్‌ 3న ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల ట్రాన్స్ఫర్ లు చేస్తారు. అక్టోబర్‌ 5 నుంచి 19వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు.

Related posts

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్థంభం ప్రతిష్ట

Bhavani

నిరుద్యోగులకు న్యాయం జరగాలె: ముషీరాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ.

Satyam NEWS

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment