30.2 C
Hyderabad
May 17, 2024 17: 43 PM
Slider నిజామాబాద్

సనాతన ధర్మంపై వ్యాఖ్యానించిన ఉదయ్ నిధి ఒక మూర్ఖుడు

#mahadevswamy

సనాతన హిందూధర్మ జాగృతి సేవ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ సద్గురు మహాదేవ్ స్వామి

తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి ఉదయ్ నిధి ఓ మూర్ఖుడని సనాతన హిందూధర్మ జాగృతి సేవాసంస్థ వ్యవస్థాపకులు శ్రీ సదగిరు మహాదేవ్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు మంత్రి ఉదయ్ నిధి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. సనాతన ధర్మంపై ఓ పిచ్చికుక్క పిచ్చి కూతలు కుసాడన్నారు. ఆయనొక మూర్ఖుడని, జ్ఞానం లేని వెధవ అని మండిపడ్డారు. సీఎం కుమారునిగా, మంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, అలెగ్జాండర్ లాంటి వారే భారతదేశాన్ని ఏం చేయలేకపోయాడని నువ్వేం చేయగలవని ప్రశ్నించారు. సనాతన ధర్మం పురాతనమైనదని, శాశ్వతమైనదన్నారు. శాంతి, అహింస, జ్ఞానం, గౌరవం, ప్రేమ సనాతన ధర్మంలో ఉంటాయన్నారు. ఎవరిని హింసించకుండా దైవత్వాన్ని గుర్తించేదే సనాతన ధర్మమని చెప్పారు. అలాంటి సనాతన ధర్మాన్ని కరోన లాంటి వ్యాధులతో పొలుస్తారా అని మండిపడ్డారు.

ప్రపంచంలో 2క్ దేశాలు ఉండేవని, అవన్నీ కనుమరుగయ్యాయని, అన్నింటికీ తట్టుకుని భారతదేశం నిలబడిందన్నారు. ఈ దేశాన్ని నాశనం చేయాలని ఎన్నో కుయుక్తులు పన్నినా సాధ్యం కాలేదన్నారు. మంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు తగదన్నారు. వెంటనే కేంద్రప్రభుత్వం ఉదయ్ నిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

జాబ్ లెస్ లైఫ్: నిరుద్యోగుల ఆత్మహత్యలే ఎక్కువ

Satyam NEWS

పెద్ద మనసుతో పేదలకు నిత్యావసరాలు పంచిన టీచర్లు

Satyam NEWS

గనుల దొంగ కేసు సిబిఐకి బదిలీ

Satyam NEWS

Leave a Comment