28.7 C
Hyderabad
May 6, 2024 00: 32 AM
Slider కడప

పెద్ద మనసుతో పేదలకు నిత్యావసరాలు పంచిన టీచర్లు

teachers

కడప జిల్లా నందలూరు మండల శాఖ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రోపాధ్యాయ సంఘం( ఎస్టీయూ ఏపీ) ఆధ్వర్యంలో నేడు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ప్రశాంతి,కవిత ల వితరణతో నందలూరు మండలంలోని నందలూరు కన్యక చెరువుకట్ట  పై నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీ  నిరుపేద కుటుంబాల వారికి వీటిని అందచేశారు.

 నిత్యావసర వస్తువులను, కూరగాయలను ఎస్టీయూ ఉపాధ్యక్షులు  చంద్ర శేఖర్,  ప్రశాంతి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ అల్లం అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు చెరువు కట్ట,హైవే, గుండ్లూరు శివాలయం, సాయిబాబా ఆలయం,గొల్లపల్లి, తోటపాలెం  గ్రామాలలోని వలస కూలీలు, యాచక బృందాలు, నిరుపేదలను గుర్తించి,   100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేసినట్లు  తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎస్టీయూ మండలశాఖ అధ్యక్షులు మోహన్ రాజు,  ప్రధాన కార్యదర్శి అబ్బు సంజీవ ప్రసాద్, నాయకులు వై.మహేశ్వర బాబు,షఫీవుల్లా,  చంద్ర శేఖర్,ప్రశాంతి,లక్ష్మికాంతమ్మ, నరసింహా  రావు,సెయింట్ జోసెఫ్  స్కూల్ ఉపాధ్యాయులు లోక్ మాన్ సింగ్, శౌరి, సభ్యులు జయకుమార్ రెడ్డి, మధు సూదన్ రెడ్డి, గ్రామ వాలంటీరు శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్ఫ్యూ సమయంలో రోడ్లపైకి మహిళలు.. అడ్డగిస్తే ఎస్ఐ బంధువని అబద్ధాలు….!

Satyam NEWS

రాజుగారి దెబ్బకు రాజకీయ వ్యూహం మరిచిన పెద్దలు

Satyam NEWS

డా౹౹చదలవాడను కలిసిన కోడెల శివరామ్

Satyam NEWS

Leave a Comment