అన్నమయ్య జిల్లా నందలూరు మండ లం అరవపల్లె లోని శ్రీ గీతా కృష్ణ గీతా మందిరం వద్ద శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణ సత్యభామ సమేత రూపిణీ కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కల్యాణం కు పట్టు వస్త్రాలు సమర్పించారు.అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన వేద పండితులు బండత్మకూరు శివ కుమార్ శర్మ,సరస రవి శర్మ,సునీల్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కల్యాణ వరులను పట్టు వస్త్రాలతో,స్వర్ణా భరణాలతో, వివిధ రకాల పుష్పాల తో అలంకరించారు. హారతి, హోమం,మాంగళ్య ధారణ తో కళ్యాణం వేడుకగా ముగిసింది.కల్యాణ ప్రాంగణం హారేరామ హరేకృష్ణ నినాదాలతో ప్రతిధ్వనించింది.చిన్నారులు చిన్ని కృష్ణుని వేష ధారణ లో కల్యాణం కు తరలి వచ్చి అలరించారు.అనంతరం పాల్గొన్న భక్తులకు ముత్యాల తలంబ్రాలు, రవిక ,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలోని మూల విరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.