41.2 C
Hyderabad
May 4, 2024 17: 22 PM
Slider నల్గొండ

గురుకుల నాన్ టీచింగ్ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయాలి

#azizpasha

గురుకులాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి పీఆర్సీని అమలు చేయాలని టి పి సి సి జాయింట్ సెక్రటరీ మహ్మద్ అజీజ్ పాషా గురువారం బహిరంగ లేఖల ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రెసిడెన్షియల్,గురుకుల, మైనార్టీ,బీసీ,ఎస్సీ,ఎస్టీ,సొసైటీల పరిధిలో గత అనేక సంవత్సరాలుగా నాన్ టీచింగ్ సిబ్బంది కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ గురుకులాల లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఇంతవరకు ప్రభుత్వం వేతనాలు పెంచటం లేదని అన్నారు.

వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి పీఆర్సీని కూడా నేటి వరకు ఇవ్వలేదని, దీనితో వీరి చాకిరీకి సరిపడా వేతనం రాక ప్రభుత్వం పీఆర్సీని కూడా నేటి వరకు అమలు చేయకపోవడంతో మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా వీరికి మాత్రం పనికి తగ్గట్టు వేతనాలు రావడంలేదని అన్నారు.

దీనితో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంటి అద్దెలు,కరెంటు బిల్లులు,నిత్యావసర వస్తువులు,పిల్లల స్కూల్ ఫీజులు ఇలా అనేక ఖర్చులతో వారి కుటుంబ పోషణ భారంగా మారి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇస్తున్నారు కానీ వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న  నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదని,గురుకులాల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి చాలీచాలని కోరారు.

వేతనాలతో కుటుంబ పోషణతో ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని,వీరికి వేతనాలు కూడా పెంచి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వివిధ గురుకులాల సొసైటీ పరిధిలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం ఉద్యోగులకు గత సంవత్సరం క్రితం నుండి ఇచ్చిన విధంగా   వీరికి కూడా అప్పటినుండి ఇప్పటివరకు పీఆర్సీని మొత్తం కలిపి ఏరియల్స్ తో  వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు.

ఈ సంవత్సరం 2023 ఈయబోయే పీఆర్సీ లో కూడా వీరికి ఉద్యోగస్థుల తోపాటు నాన్ టీచింగ్ సిబ్బంది కూడా అమలు జరిగేటట్లు చూడాలని అన్నారు. ఇట్టి  విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే గురుకులాలలో వివిధ సొసైటీలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి  పిఆర్సి,ఏరియన్స్ ఇచ్చి వారిని ఆదుకోవాలని బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య, సమ్మెట సుబ్బరాజు,ముషం సత్యనారాయణ,కోల మట్టయ్య,దొంతగాని జగన్,సైదులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

విశాఖ‌ – రాయ్‌పూర్ జాతీయ ర‌హ‌దారి భూ సేక‌ర‌ణ‌లో వేగం పెంచాలి

Satyam NEWS

ద్రౌపది ముర్మూకే మాయావతి మద్దతు

Satyam NEWS

జోడోయాత్ర లో 2 నిమిషాలు మౌనం

Murali Krishna

Leave a Comment