ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతున్న తరుణంలో ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోవడం మరింత ఆందోళన రేపింది. బోయింగ్ 737 విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక కారణాలతోనే ఈ విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో సాంకేతిక సమస్యల కారణంగా ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఇమామ్ ఖోమైనీ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 180 మంది ప్రయాణిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రమాదంపై తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post