32.2 C
Hyderabad
May 12, 2024 19: 35 PM
Slider నిజామాబాద్

25 రోజులకు స్పష్టమైన హామీతో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆదోళన విరమణ

#satyanarayana

జిల్లా విద్యాశాఖలో కీలకంగా పని చేస్తున్నసమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఉద్యోగుల పొరుబాటతో సంబంధిత శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ఉద్యోగులు దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల 28 న ప్రారంభమైన నిరాహార దీక్షలు నిరంతరంగా 25 రోజుల పాటు కొనసాగాయి.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు తమ దీక్షలు విరమించేందుకు ఉద్యోగులు ససేమిరా అన్నారు. 25 రోజుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి స్పష్టమైన హామీ లభించిందని, అందుకే దీక్షలను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు జెఎసి ప్రతినిధులు తెలిపారు. నిరాహార దీక్ష శిబిరాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సందర్శించి ఎస్.పి.డి దేవసేన ఆదేశాలు, హామీ మేరకు దీక్ష విరమించాలని తెలిపారని జెఎసి అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. 

వివిధ రూపాల్లో నిరసన

సమగ్ర శిక్ష ఉద్యోగులు 25 రోజుల నిరాహార దీక్షలో వివిధ రూపాల్లో తమ నిరసనలు ప్రభుత్వానికి తెలిపారు. మొదట కలెక్టరేట్ వద్దకు  భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బోనాలు తీశారు. భిక్షాటన చేపట్టారు. చాయ్ అమ్ముతూ, బజ్జిలు చేసి విక్రయిస్తూ నిరసన చేపట్టారు. ఒకరోజు జాగరణ చేపట్టారు. నిజాంసాగర్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన, మోకాళ్లపై నిలబడి ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు ప్రభుత్వానికి తెలిపే అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టారు

ఉపాధ్యాయ సంఘాల మద్దతు

25 రోజుల నిరసన దీక్షలకు పొలిటికల్ పార్టీలే కాకుండా విద్యాశాఖకు చెందిన ఉపాధ్యాయ సంఘాలు సైతం సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించాయి. సీఆర్పీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆర్థిక చేయూత అందించారు. నిరసన చేస్తున్న ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలిచారు. తామున్నామంటూ భరోసా కల్పించారు.

ప్రధాన డిమాండ్స్ ఇవే

సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమం టైమ్ స్కేల్ అమలు చేయుట

ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా ఐదు లక్షలు కల్పించాలి

మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వాలి

నిరాహార దీక్షలకు జరిగిన రోజులలో వేతనం ఇవ్వాలి

Related posts

ఉల్లి నిల్వలపై విజిలెన్స్ దాడులు

Satyam NEWS

జైలు నుండి విడుదలైన రాఘవ

Sub Editor 2

శ్రీశైల మహా క్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు

Satyam NEWS

Leave a Comment