29.7 C
Hyderabad
May 3, 2024 05: 57 AM
Slider ఆంధ్రప్రదేశ్

ట్రాజెడీ: గుండెపోటుతో రాజధాని రైతు మృతి

jagan farmer

రాజధాని ప్రాంతం  కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు  అద్దేపల్లి కృపానందం (68) బుధవారం  తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా  నిరసనల్లో పాల్గొంటున్నారు.

సీఎం జగన్‌ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఆయన  తనకున్న  0.50 సెంట్ల  భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున  గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు కృపానందంను మంగళగిరి లోని  ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. రాజధాని రైతు మరణించాడనే వార్త తెలియడంతో  గ్రామ ప్రజలు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.

Related posts

మాజీ మేయర్ బొంతు ఆధ్వర్యంలో ప్రీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు

Bhavani

పాతపట్నంలో మాస్కులు పంపిణీ చేసిన ఎంజీఆర్

Satyam NEWS

బాసర శ్రీజ్ఞాన సరస్వతి క్షేత్రంలో వసంత పంచమికి ఘన ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment