28.2 C
Hyderabad
May 17, 2024 10: 47 AM
Slider హైదరాబాద్

వ్యాయామంతో క‌రోనా దూరం.. ఆరోగ్యం సొంతం

Srinivas Goud

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక వ్యాయామం తప్పనిసరి అని, వాకింగ్, రన్నింగ్ ను ప్రతి ఒక్కరూ ప్రతి రోజు చేసుకునేలా అలవాటు చేసుకోవాలని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మాదాపూర్ లోని నోవాటేల్ హోటల్ లో CII -125వ వార్షికోత్సవం సందర్భంగా CII – UR LIFE ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్ నెస్ రన్ – 2020 (Well Ness RUN – 2020)ను మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ‌రీర నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు క్రీడలకు, క్రీడాకారులకు రాష్ట్రంలో పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన CII ప్రతినిధులను మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మిస్ట‌ర్‌ యూనివర్స్ మోతెశ్యామ్ అలీ ఖాన్, CII – తెలంగాణ మాజీ ఛైర్మన్ సంజయ్ సింగ్ సింగ్, డా. ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, డిఫెన్స్ ప్యానెల్ తెలంగాణ కన్వీనర్ ఆర్ఎస్‌. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

25న ముస్లిం సంఘాల రౌండ్ టేబుల్ సదస్సు

Satyam NEWS

3న జరిగే చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

Satyam NEWS

మందకృష్ణ మాదిగను పరామర్శించిన సీతక్క

Satyam NEWS

Leave a Comment