40.2 C
Hyderabad
May 6, 2024 16: 21 PM
Slider ముఖ్యంశాలు

3న జరిగే చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

Collage Maker-01-Aug-2022-12.06-AM

కేంద్ర ప్రభుత్వం తెచ్చే నాలుగు లేబర్ కోడ్ ల చట్టాల వల్ల కోట్లాది మంది కార్మికులకు కష్టాలు తెచ్చి పెట్టినట్లేనని, దీనికి వ్యతిరేకంగా చలో హైదరాబాద్ కి ఆగస్టు 3వ,తేదీన కార్మికులు పెద్ద ఎత్తున కదలి రావాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కార్మికులని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సిమెంట్ కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు,హమాలి కార్మికుల విస్తృత స్థాయి సమావేశంలో ఆదివారం రోషపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కనీస వేతన 73 షెడ్యూల్ పరిశ్రమల జీవోలు సవరణ చేసి అమలు చేయాలని, సిమెంటు పరిశ్రమలలో కాట్రాక్ట్ కార్మికులకి రావాల్సిన వేతనాలలో కటింగ్ చేసి ఇవ్వటం అన్యాయమని ఆరోపించారు. లేబర్ అధికారులు వివిధ పరిశ్రమల మీద ఆదివాసి లేకుండా పోయిందని, వీటితోపాటు సంఘటిత రంగంలోని కార్మికుల సమగ్ర వేతనం చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి అమలు చేయాలని, గ్రామీణ హమాలీ లకు కూడా హెల్పర్ బోర్డ్ సౌకర్యం కల్పించాలని అన్నారు.అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్.కె ముస్తఫా,శీలం వేణు, వెంకన్న,గిరి,కృష్ణ,ప్రభాకర్,శ్రీను, నాగేశ్వరరావు,ఆజార్,శౌరి,భాష,రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

వానలు రాగానే అన్ని చెరువులు నింపాలి

Satyam NEWS

శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ

Satyam NEWS

మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన బన్నాల గీత

Satyam NEWS

Leave a Comment