30.2 C
Hyderabad
May 17, 2024 16: 31 PM
Slider విజయనగరం

రాత్రి పూట కర్ఫ్యూ పకడ్బందీగా అమలు జరగాలి

#vijayanagarmpolice

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక పోలీసు కార్యాలయంలో జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ – కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, కోవిడ్ ను నియంత్రించేందుకు క్షేత్ర స్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నందున, వ్యాధి ప్రభావానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది డబుల్ మాస్కులు, ఫేస్ షీల్డు ధరించాలని, తరుచూ చేతులను శుభ్రపరుచుకోవాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. అదే విధంగా కోవిడ్ నిబంధనలు గురించి ప్రజలకు అవగాహన కల్పించి, కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ ప్రదేశాలలో, షాపుల వద్ద కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించే విధంగా షాపు యజమానులు క్యూ లైన్లును ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాత్రి 11 గంటల నుండి తెల్లవారి 5 గంటల వరకు అత్యవసర సర్వీసుల మినహా కర్ఫ్యూని అమలు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. జూదం ఆడే కేసుల్లో 10వేలు కంటే పట్టుబడితే నిందితులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలన్నారు.

నమోదై, విచారణలో ఉన్న కేసుల ప్రగతిని ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్ లో నమోదు చేయాలన్నారు. అనుమానస్పద వ్యక్తుల వేలి ముద్రతలను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ తో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో పెండింగులో ఉన్న అరెస్టులను వెంటనే చేపట్టి, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.

పోలీసు అధికారులు తమ పరిధిలో తరుచూ గ్రామ సందర్శనలు చేయాలని, స్థానికంగా ఉండే ప్రజలకు మాదక ద్రవ్యాల నియంత్రణకు, దిశా యాప్, రహదారి భద్రతా నియమాలు, కోవిడ్ జాగ్రత్తలు పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే శంబర పోలమాంబ పండుగకు కోవిడ్ కారణంగా ప్రజలు ఎక్కువ మంది రాకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

అనంతరం, సిఐలు, ఎస్పీలు దర్యాప్తు చేస్తున్న తీవ్రమైన నేరాలను జిల్లా ఎస్పీ సమీక్షించి, కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసే విధంగా అధికారులకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక దిశా నిర్దేశం చేసారు.

ఈ జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఎస్ ఈ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, విజయనగరం అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ  ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశ మహిళా పీఎస్ డిఎస్పీ టి.త్రినాధ్, ఎఆర్ డీఎస్పీఎల్.శేషాద్రి, లీగల్ ఎడ్వయిజర్ వై. పరశురాం, సీఐలు బి.వెంకటరావు, జి.రాంబాబు, రుద్రశేఖర్, జి.మురళి, సి. హెచ్.లక్ష్మణ రావు, టి.ఎస్.మంగవేణి, విజయనాధ్, బాల సూర్యారావు, సింహాద్రినాయుడు, సిహెచ్. శ్రీనివాసరావు, డి.రమేష్, జి.సంజీవరావు, ఎం. నాగేశ్వరరావు, పి. శోభన్ బాబు, ఎల్.అప్పలనాయుడు, టి.వి తిరుపతిరావు, విజయ ఆనంద్, నర్సింహమూర్తి, వివిధ పోలీసు స్టేషన్ లలో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

మార్చి 29న వి‌ఐ‌పి దర్శనాలు రద్దు

Sub Editor 2

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా

Bhavani

పెద్దదడిగి కార్యదర్శిని బదిలీ చేయరాదని గ్రామస్తుల వినతి

Satyam NEWS

Leave a Comment