28.2 C
Hyderabad
May 17, 2024 11: 49 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

అయోధ్య తీర్పు నేపథ్యంలో నాలుగు అంచెల భద్రత

SupremeCourtofIndia

రామజన్మభూమి అయోధ్య, బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు త్వరలో వెలువడనున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ ఉన్న నేపథ్యంలో దానికి ముందే తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫైజాబాద్‌ జిల్లాలో ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. 144 సెక్షన్‌, ఇతర నిషేధాజ్ఞలు డిసెంబర్‌ 28 వరకు కొనసాగుతాయని జిల్లా మేజిస్ట్రేట్‌ ఇటీవల ఆదేశించారు. తీర్పు తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి అభ్యంతరకర సందేశాలు రాకుండా నిఘా కోసం ప్రభుత్వం 16 వేల మంది వలంటీర్లను నియమించింది. భద్రత విషయంలో రెడ్‌, ఎల్లో, గ్రీన్‌, బ్లూ జోన్లుగా నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు.

Related posts

పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నా కూతురు కాదు

Satyam NEWS

విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

Satyam NEWS

ఎన్నికల వేళ తప్పుకున్న త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్

Satyam NEWS

Leave a Comment