21.2 C
Hyderabad
December 11, 2024 21: 09 PM
Slider ఆంధ్రప్రదేశ్

స్వీట్లు పంచుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు

ap secratariat

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గా పని చేసిన ఎల్ వి సుబ్రహ్మణ్యం అవమానకరమైన బదిలీకి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర క్యాడర్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యంను కుర్చి, బల్ల కూడా లేని చోటుకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంపై అన్ని విపక్ష పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం ముఖ్యమంత్రికి ఉన్న అధికారమని, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ముఖ్యమంత్రి కార్యాలయం అనధికారికంగా అదే రోజు వాట్సప్ లో వివరణలు పంపింది. ముఖ్యమంత్రి చెప్పినా కూడా అధికారులను బదిలీలు చేయడం లేదని, అందువల్ల పనులు ఆగిపోతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం అనధికారికంగా పంపిన మెసేజ్ లో పేర్కొన్నది. ముఖ్యమంత్రి ఫలానా స్థానంలో ఫలానా అధికారిని అప్పాయింట్ చేయమని చెప్పినా కూడా ఎల్ వి సుబ్రహ్మణ్యం అలా చేయడం లేదని, వారు సరైన అధికారులు కాదు అంటూ సాకులు చెబుతున్నారని ఇది ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించిందని కూడా వారు వివరణ ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా మరో వైపు ఎల్ వి సుబ్రహ్మణ్యం ను బదిలీ చేయగానే పలువురు మంత్రులు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కు ఫోన్ చేసి తమ సంతోషం వ్యక్తం చేశారట. ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారని, తాము చేయాలనుకున్న ఏ పనీ ఎల్ వి సుబ్రహ్మణ్యం వల్ల చేయలేకపోతున్నామని మంత్రులు అన్నారట. తమకు తమ శాఖ లో పట్టు రావడం లేదని అందువల్ల ‘‘కావాల్సిన పనులు’’ చేసుకోలేకపోతున్నామని మంత్రులు అభిప్రాయపడ్డారట. ఎల్ వి సుబ్రహ్మణ్యం అడ్డు తొలగడంతో ఇక తమకు కావాల్సిన అధికారిని డిపార్టుమెంటు హెడ్ గా పెట్టుకుని పనులు పూర్తి చేసుకోవడానికి వీలుకలుగుతుందని ఎంతో సంతోషం వ్యక్తం చేశారట. ఎల్ వి సుబ్రహ్మణ్యం అడ్డు తొలగిపోయినందుకు మంత్రులు ఆనందం వ్యక్తం చేసిన విషయం ఇప్పుడు ఏపి సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts

దళితబంధు పథకం క్రింద 573 డెయిరీ యూనిట్ల మంజూరు

Murali Krishna

కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం?

Satyam NEWS

ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment