25.2 C
Hyderabad
May 16, 2024 21: 51 PM
Slider నల్గొండ

గిరిజన బిడ్డ నిఖిల్ మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి

#nikhil

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని బంజారా భవనం నందు గురువారం జరిగిన జి.హెచ్.పి.ఎస్.నాయకుల సమావేశంలో గిరిజన బంజారా బిడ్డ దారావత్ నిఖిల్ నాయక్ మృతిని గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది నగేష్ రాథోడ్,నియోజకవర్గ సేవాలాల్ ఉత్సవ కమిటీ కన్వీనర్ బాణావత్ వెంకటేశ్వర్లు నాయక్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గిరిజన బంజారా బిడ్డ దారావత్ నిఖిల్ నాయక్ మృతిపై అధికారులు సత్వరమే విచారణ జరిపి కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ఆర్థిక భరోసా ప్రభుత్వం చేకూర్చాలని అన్నారు.  ఇది ముమ్మాటికీ ప్రేమ పేరిట పరువు హత్యను తలిపిస్తుందని దీనిపై వెంటనే విచారణ జరిపి కారకులపై ఎస్సీ,ఎస్టీ  అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆధునిక సమాజంలో ఉండి ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడాటాన్ని జి.హెచ్.పి.ఎస్.తీవ్రంగా ఖండింస్తుందని అన్నారు.

మృతుడు తండ్రి దారావత్ భాస్కర్ నాయక్ తన కుమారుడు కనిపించడం లేదని ఈ నెల 9వ,తారీకున పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మూడు రోజుల తరువాత బుధవారం చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెం కాలువలో శవమై కనిపించడం ఇది ముమ్మాటికీ ప్రేమ పేరిట పరువు హత్యను తలపిస్తుందని, గతంలో దారావత్ నిఖిల్ అగ్రకులానికి చెందిన యువతితో చనువుగా ఉండడం అది జిర్ణించుకోలేకనే యువతి తరుపు వారు హత్య చేయించరేమో అనే అనుమానం కలుగుతుందని, అనుమానితులను విచారించి నిఖిల్ మృతి కారుకులైన వారిని శిక్షించాలని జి.హెచ్.పి.ఎస్.డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో జి.హెచ్.పి.ఎస్. సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా నాగు నాయక్,బాణావత్ శ్రీను నాయక్,మోతిలాల్ నాయక్,తులిసి నాయక్,భట్టు నాయక్,బాపూరావు, లాలాజీ సింగ్,మల్లికార్జున్,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

కథలాపూర్ లో రాళ్ల వానతో తడిసిన ధాన్యం

Satyam NEWS

కేసీఆర్ అధికారంలో ఉంటే ఇళ్లురావు, ఉద్యోగాలు రావు

Satyam NEWS

అన్ని చోట్లా బీజేపీని గెలిపిస్తున్న మజ్లీస్ పార్టీ

Satyam NEWS

Leave a Comment