38.2 C
Hyderabad
May 3, 2024 22: 53 PM
Slider ప్రత్యేకం

దుబ్బాక హుజురాబాద్ లలో హామీలు అమలు చేయలేని బీజేపీ

#bjptelangana

దుబ్బాక‌, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఇచ్చిన హ‌మీలు నేటికీ అమ‌లు కాలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నది. ‘‘దుబ్బాకలో దున్న‌కానికి ఎడ్లు రాలే…హుజురాబాద్ రైతుల‌కు మోడి పించ‌న్లు అంద‌లే’’ అంటూ బీజేపీ ఇచ్చిన హామీలపై ఫ్యాక్ట్ చెక్ పోరుతో వివరాలను ప్రజలకు తెలియచేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంతో నిమిత్తం లేకుండా కేంద్ర నిధుల‌తో నియోజక‌వ‌ర్గాన్ని అభివ్రుద్ది చేస్తామ‌ని హ‌మీల వ‌ర్షం కురిపించింది. నమ్మిన జ‌నం బీజేపీని గెలిపించారు. మ‌రి హ‌మీల మాటేమిటి?   కేంద్ర నిధుల క‌థెంటి? ఓ సారి ప‌రిశీలిద్దాం.

దుబ్బాక హ‌మీల అమ‌లుపై ఫ్యాక్ట్ చెక్‌

ప్ర‌తి రైతు కుటుంబానికి వ్య‌వసాయ ప‌నుల నిమిత్తం రెండు ఎద్దులు, ఒక నాగ‌లి ఇస్తామ‌ని ర‌ఘునంద‌న్ రావు హ‌మీ ఇచ్చారు. కాని ఇప్ప‌టికైతే దున్న‌కానికి ఎద్దులు రాలేదు.

కేంద్రం త‌రుఫున ప్ర‌తి నిరుద్యోగికి నెల‌కు మూడు వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామ‌ని బీజేపీ హ‌మీ ఇచ్చింది. కాని ఇప్ప‌టికైతే భ్రుతి నిరుద్యోగికి అంద‌లేదు.

మోడి స‌ర్కార్ ద్వారా ప్ర‌తి పంట‌కు అవ‌స‌ర‌మైన ఎరువుల‌ను ఉచితంగా పంపిణి చేస్తాం. ఉచితం మాట దెవుడెరుగు ఎరువుల ధ‌ర‌లైతే భారిగా పెంచారు.

దుబ్బాక ప‌ట్ట‌ణానికి కేంద్ర నిధుల ద్వారా ఔట‌ర్ రింగ్ రొడ్డు నిర్మిస్తామన్న హ‌మీ అమ‌లుకు నోచు కోలేదు.

నిరుపేద అమ్మాయిల వివాహానికి పుస్తే, మ‌ట్టెలు, ఒక జ‌త బ‌ట్ట‌లు ఇస్తామ‌న్న హ‌మీ అమ‌లు కాలేదు. దుబ్బాక నియోజ‌వ‌ర్గ అభివ్రుద్ది కోసం బీజేపీ ఇచ్చిన‌ 16 హ‌మీలు మానిఫెస్టో కాగితాల‌కే ప‌రిమితం అయ్యాయి త‌ప్ప కార్య‌చ‌ర‌ణ‌కు నోచు కోలేదు

హుజురాబాద్ హ‌మీల అమ‌లుపై ఫ్యాక్ట్ చెక్‌

నియోజ‌క‌వ‌ర్గంలోని 60 ఏండ్లు దాటిన చిన్న స‌న్నకారు రైతులంద‌రికి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్ ధ‌న్ యోజ‌న కింద నెల‌కు 3000\- పింఛ‌న్ ఇస్తామ‌న్న హ‌మీ ఇంకా హుజురాబాద్ కు చేరుకోలేదు. ఇక్క‌డ బీజేపీ గెలిచి ఏడాది కావ‌స్తున్నా నేటికి ఒక్క రైతుకు మోడి పించ‌న్ అంద‌లేదు.

హుజురాబాద్ నియోజ‌వ‌ర్గ ప‌రిధిలోని అన్ని రైల్వే స్టేష‌న్ల ఆధునీక‌ర‌ణ‌, అండ‌ర్ బ్రిడ్జిలు, రైల్ ఓవ‌ర్ బ్రిడ్జిల‌ను నిర్మిస్తాం అని హ‌మీ ఇచ్చారు. కాని రైల్వే స్టేష‌న్ల అభివ్రుద్ది, బ్రిడ్జిల నిర్మాణం యాడి దాకా వ‌చ్చిందో ఎవ‌రికి తెలియ‌దు.

కేంద్ర విద్యాలక్ష్మి ప‌థ‌కం కింద విదేశాల్లో చ‌దివే విద్యార్ధుల‌ను ఆదుకుంటాం. ఇప్ప‌టి వ‌ర‌కైతే ఒక్క విద్యార్ది కూడా కేంద్ర విద్యాలక్ష్మి ప‌థ‌కం కింద విదేశి విద్య‌కు వెల్లిన‌ట్లు చూడ‌లేదు.

కేంద్ర నిధుల‌తో జ‌మ్మికుంట‌, హుజురాబాద్ ప‌ట్ట‌ణాలను అభివ్రుద్ది చేసి సుంద‌రీక‌రిస్తాం. గ‌త ఏడాది కాలంగా ఈ రెండు ప‌ట్ట‌ణాల‌కు  కేంద్ర నిధులు అంద‌లేదు.

కేంద్ర నిధుల‌తో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తామ‌న్న హ‌మీ..హ‌మీగానే మిగిలిపోయింది.

కేంద్ర క్రిషి సంచాయ్ యోజ‌న కింద కాల్వ‌ల మ‌ర‌మ‌త్తు కు తెస్తామ‌న్న‌ నిధుల జాడ లేదు.

ఇలా హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఇచ్చిన మొత్తం 20 హ‌మీలు అమ‌లుకు నోచు కోలేదని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇవ్వాలి

Satyam NEWS

శ్రీశైల పుణ్య క్షేత్రంలో కూష్మాండదుర్గ అలంకారం

Satyam NEWS

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

Bhavani

Leave a Comment