మాజీ ఎం.బి.సి. చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ డిబేట్లో లోకల్ రిపోర్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసారని విలేకరులు ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓయూ ఏసీపీ జగన్ ను కలిసి ఫిర్యాదు కాపీని రిపోర్టర్లు అందచేశారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి అయినటువంటి మీడియా ప్రతినిధులను కించపరిచేలా వ్యవహరించడం సరి కాదని వారు అభిప్రాయపడ్డారు. వెంటనే తాడూరి శ్రీనివాస్ తమకు క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు.
సత్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్