23.7 C
Hyderabad
May 17, 2024 03: 54 AM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద క‌దం తొక్కిన ఆశా వ‌ర్క‌ర్లు

#aasha workers

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్  ప్రాంగ‌ణం అంతా  ఆశా వ‌ర్క‌ర్ల ధ‌ర్నాతో   నిర‌స‌న‌లు,నినాదాల‌తో మారుమోగింది. పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ..త‌మ‌ను శాశ్వ‌త ఉద్యోగ‌స్తుల‌గా ధృవ‌కరీణ ప‌త్రం ఇవ్వాలంటా జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 మంద ఆశావ‌ర్క‌ర్లు జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు.ఒకానొక స‌మ‌యంలో  క‌లెక్టర‌ట్ ప్రాంగ‌ణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ఆశా వ‌ర్క‌ర్లు య‌త్నించారు.

అయితే ముందుగానే ఆశావ‌ర్కర్ల నిర‌స‌న కార్య‌క్ర‌మం తెలుసుకున్న విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ ..ఎస్పీ ఆదేశాల‌తో  వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ,రూర‌ల్ సీఐ మంగ‌వేణిలు… ఎస్ఐ సూర్యానారాయాణ‌, విజ‌య్ కుమార్ , లేడీ కానిస్టేబుళ్ల‌తో పాటు ఎస్టీఎఫ్ సిబ్బంది కూడా బందోబ‌స్తుకై రంగంలోకి దిగారు.వారింద‌రినీ ఠ‌లాయించి మరీ ఆశా వ‌ర్క‌ర్లు..క‌లెక్ట‌రేట్ లోకి చొచ్చుకెళ్లుందుకు య‌త్నించారు.

త‌మ‌కు  కనీసవేతనం  21,వేలు  ఇవ్వాల‌ని…త‌మ‌ను… సచివాలయాలకు బదలాయింపు వెంటనే ఆపాలని..అలాగే మాకు కూడా ప్ర‌భుత్వ  సంక్షేమ పధకాలు అమలుచేయాలి కోరారు.అదే విధంగా రిటైర్మెంట్ కల్పించాలని,  భీమాసదుపాయం కల్పించాలని క‌రానో తో నురణించిన ఆశా  వ‌ర్క‌ర్ల కు భీమావిడుదల చేయాలని డిమాండ్ చేసారు.

ఇక . వైద్యఆరోగ్యశాఖలోనే ఆశా వ‌ర్క‌ర్ల‌తో పనిచేయించాలని… 1000 నుండి 1200 జనాభాకు ఒక ఆశ వ‌ర్క‌ర్ ను నియమించాలని వారికి 10వేల‌ వేతనం ఒకేసరి ఇవ్వాలని కూడా వారంతా డిమాండ్ చేసారు.దాదాపు గంట‌న‌ర్న‌కు పైగా క‌ల‌క్టర‌ట్ ప్రాంగణం ఆశా వ‌ర్క‌ర్లు నినాదాల‌తో హోరెత్తింది

Related posts

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

Bhavani

ములుగులో తెలంగాణ జాగృతి సంక్రాంతి సంబరాలు

Bhavani

జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేయాలి

Satyam NEWS

Leave a Comment